ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండేళ్లయినా బిల్లులు రాక గగ్గోలు

ABN, First Publish Date - 2022-12-07T23:54:33+05:30

మండలంలో ఉపాధి హామి పథకం నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంత వరకు బిల్లులు రాక పోవటంతో అధికార పార్టీకి చెందిన వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. పుట్టిన కాడికల్లా అప్పులు తీసుకు వచ్చి సిమెంట్‌ రోడ్లు, మురుగు కాలువలు నిర్మిస్తే ఇంతవరకూ బిల్లులు రాక పోవటంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగి పోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముండ్లమూరు, డిసెంబరు 7 : మండలంలో ఉపాధి హామి పథకం నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంత వరకు బిల్లులు రాక పోవటంతో అధికార పార్టీకి చెందిన వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. పుట్టిన కాడికల్లా అప్పులు తీసుకు వచ్చి సిమెంట్‌ రోడ్లు, మురుగు కాలువలు నిర్మిస్తే ఇంతవరకూ బిల్లులు రాక పోవటంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగి పోయాయి. పది రూపాయలు మిగులుతాయని ఆశ పడిన ఆ నాయకులు నేడు అప్పులోళ్లు ఇంటికి వస్తుండటంతో మొఖం చాటేస్తున్నారు. బిల్లులు ఎప్పుడు పడతాయా? అని సంబంధిత అధికారులకు ఫోన్‌లు చేయటమే కాక ప్రతి రోజూ కార్యాలయాల చుట్టూ తిరిగి వె ళుతున్నారు. మండలంలో ఉపాధి హామీ పథకం నిధులతో 2020వ సంవత్సరంలో సిమెంట్‌ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించారు. మొత్తం రూ. 87 లక్షలకు పైనే నిధులు రావాల్సి ఉంది. రెండు సంవత్సరాలు కావస్తున్నా బిల్లులు రాక పోవటంతో అప్పులు ఇచ్చిన వారు నేరుగా కాంట్రాక్టర్‌ ఇంటి వద్దకు వెళ్లి బిల్లులతో మాకేం పని డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. మండలంలోని ఒక గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు సిమెంట్‌ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించి బిల్లులు రాక పోవటంతో అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి ఎక్కువ కావటంతో తనకు ఉన్న ఎకరం పొలాన్ని అమ్మి వారం రోజుల క్రితం అప్పులు తీర్చిన విషయం వెలుగులోకి వచ్చింది. అధికార పార్టీలో ఉన్నామనే తప్ప సంతోషం మాత్రం లేదని పనులు చేసిన నాయకులు వాపోతున్నారు. ప్రధానంగా ముండ్లమూరు మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో సీసీ రోడ్లు నిర్మించటంతో పాటు గ్రామ సచివాలయాన్ని నిర్మించిన నాయకుడికి డబ్బులు రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశాడు.

Updated Date - 2022-12-07T23:54:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising