ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సంక్షేమం’తో మెరుగైన జీవనం

ABN, First Publish Date - 2022-08-05T05:04:52+05:30

వివిధ పథకాల ద్వారా పొందే లబ్ధిని లబ్ధిదారులు సద్విని యోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు.

మట్లాడుతున్న ఎమ్మెల్యే కరణం బలరాం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే కరణం బలరాం

 చీరాల, ఆగస్టు 4: వివిధ పథకాల ద్వారా పొందే లబ్ధిని లబ్ధిదారులు సద్విని యోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. స్థానిక ఎ న్‌ఆర్‌ అండ్‌ పీఎం హైస్కూల్‌ ప్రాంగ ణంలోని ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లో గురు వారం మున్సిపల్‌ కమిషనర్‌ సీహెచ్‌ నా గమల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నూతనంగా మం జూరైన  పెన్షన్లను బలరాం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధిని సమంగా ముందుకు తీసుకుపో తూ, ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన విధానానికి మార్గం సుగమం చేస్తున్న ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. 

మున్సిపల్‌ చైర్మన్‌ జంజన శ్రీనివాసరావు, వైస్‌ చైర్మన్లు బొనిగల జైసన్‌బాబు, శిఖాకొల్లి రామసుబ్బులు, ఆర్‌బీకే ఛైర్మన్‌ కావూరి రమ ణారెడ్డి తదితరులు మాట్లా డుతూ ప్రభుత్వ పధకాల అమలుతీరును వివరించారు. కార్యక్రమంలో మెప్మా పీడీ రవి, మున్సిపల్‌, సచివాలయ సిబ్బంది, జలంటీర్లు, పలువు రు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాగా, స్థానిక రామనగ ర్‌లో రూ.51 లక్షలతో నిర్మించ నున్న అండర్‌గ్రౌండ్‌ డ్రయినేజీకి  ఎమ్మెల్యే బలరాం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘ కాలిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించామన్నారు. 

కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, వైస్‌ చైర్మన్‌ బొనిగల జైసన్‌బాబు, మల్లి రామకృష్ణ, మల్లి వైష్ణవి తది తరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-05T05:04:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising