ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి రాయితీపై శనగ విత్తనాలు

ABN, First Publish Date - 2022-10-07T06:27:54+05:30

మండలంలోని శనగపంట సాగు చేసుకునే రైతులకు ఈ నెల 7 శుక్రవారం నుంచి రైతుభరోసా కేంద్రాల్లో శనగ విత్తనాలకు ఓటీపీలు నమోదు చేయనున్నట్లు వ్యవసాయాధికారి వై.విజయభాస్కర్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిద్దలూరు టౌన్‌, అక్టోబరు 6 : మండలంలోని శనగపంట సాగు చేసుకునే రైతులకు ఈ నెల 7 శుక్రవారం నుంచి రైతుభరోసా కేంద్రాల్లో శనగ విత్తనాలకు ఓటీపీలు నమోదు చేయనున్నట్లు వ్యవసాయాధికారి వై.విజయభాస్కర్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రైతు ఆధార్‌, పట్టాదారు పాస్‌పుస్తకంతో ఆర్‌బీకేకు వెళ్లి శనగ విత్తనాల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. రాయితీపై జేజీ-11 రకం క్వింటా ధర రూ.6456 రూపాయలు ఉండగా రాయితీపై రూ.4842 అందజేస్తామన్నారు. 25శాతం రాయితీతో ప్రభుత్వం విత్తనాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కాక్‌-2 రకం క్వింటా ధర రూ.8856 ఉండగా రూ.6642 అందజేస్తామన్నారు. గిద్దలూరు మండలంలో జేజీ-11 రకం 1609 క్వింటాళ్లు కాక్‌-2 రకం 99 క్వింటాళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి రైతు ఖరీఫ్‌లో ఈ-పంట నమోదుకు సంబంధించి అక్టోబరు 12 లోపు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు.


Updated Date - 2022-10-07T06:27:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising