ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2.09 లక్షల మంది తల్లులకు లబ్ధి

ABN, First Publish Date - 2022-06-27T05:16:48+05:30

జిల్లాకు అమ్మఒడి పథకం కింద ప్రభుత్వం రూ.314.66 కోట్లు మంజూరు చేసింది. సోమవారం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి ఈ నిధులను తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. జిల్లాలోని 38 మండలాల్లో 1 నుంచి ఇంటర్మీడియేట్‌ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులు 20,9776 మంది ఖాతాలకు ఈనిధులు జమ కానున్నాయి.

అమ్మఒడికి రూ.314.66 కోట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు పాఠశాలల్లో 

ఒక్కరూ అర్హత సాధించని వైనం

ఒంగోలు (కలెక్టరేట్‌), జూన్‌ 26 : జిల్లాకు అమ్మఒడి పథకం కింద ప్రభుత్వం రూ.314.66 కోట్లు మంజూరు చేసింది. సోమవారం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి ఈ నిధులను తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. జిల్లాలోని 38 మండలాల్లో 1 నుంచి ఇంటర్మీడియేట్‌ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులు 20,9776 మంది ఖాతాలకు ఈనిధులు జమ కానున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా అమ్మఒడికి అర్హత సాధించలేదు. ఒంగోలు, చీరాలలోని రెండు పాఠశాలల్లో విద్యార్థులు యాజమాన్యాల తీరు వల్ల నష్టపోయారు.  నిబంధనల ప్రకారం 75శాతం హాజరు ఉన్న విద్యార్థులు మాత్రమే అమ్మఒడి లబ్ధిపొందేందుకు అర్హులు. అయితే ఈసారి మాన్యువల్‌గా కాకుండా మొబైల్‌ డివైజ్‌ల ద్వారా యాప్‌లో హాజరు నమోదు చేయాలని సూచించారు.  అయితే ఈ రెండు పాఠశాలల్లో విద్యార్థులకు ఈహాజరు నమోదు కాలేదు. దీంతో వారు అమ్మఒడికి దూరమయ్యారు.

అట్టడుగున సంతనూతలపాడు

అమ్మఒడి లబ్ధిదారుల విషయంలో సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం జిల్లాలో అట్టడుగున నిలిచింది. ఈనియోజకవర్గలో గత ఏడాది 21,584 మంది తల్లులకు రూ.32.38 కోట్లు విడుదల కాగా ఈసారి రూ.1.58 కోట్లు తక్కువగా 20,538 మంది తల్లులకు రూ.30.80 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. ఒంగోలు నియోజకవర్గంలో గత ఏడాదికంటే నాలుగు లక్షలు తక్కువగా విడుదల చేశారు. అమ్మఒడి జిల్లా కార్యక్రమాన్ని సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన సమావేశం హాలులో ఏర్పాటు చేసినట్లు డీఈవో విజయభాస్కర్‌ తెలిపారు. 

Updated Date - 2022-06-27T05:16:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising