రాష్ట్రంలో నిరంకుశ పాలన
ABN, First Publish Date - 2022-08-05T05:07:31+05:30
రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని సీపీఐ రాష్ట్ర నాయకుడు రావుల వెంక య్య ధ్వజమెత్తారు.
సీపీఐ నేత రావుల వెంకయ్య ధ్వజం
బల్లికురవ, ఆగస్టు 4: రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని సీపీఐ రాష్ట్ర నాయకుడు రావుల వెంక య్య ధ్వజమెత్తారు. గురువారం కొణిదెన గ్రామంలో జ రిగిన బల్లికురవ మండల సీపీఐ 6వ మండల మహా సభకు కార్యదర్శి వల్లెపు నరసింహం అధ్యక్షత వహిం చారు. ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ ఒక చేత్తో పథకాలు పంపిణీ చేస్తూ, రెండో చేత్తో అధిక పన్నులు, ధరలు పెంచి ప్రజల నుంచి ప్రభుత్వం ముక్కుపిండి వసూళ్లు చేస్తుందన్నా రు. సామాన్యుడు బతికే పరిస్థితి లేదని ఆయన ఆందోళన వ్యక్తం చే శారు. సంక్షేమ పథకాలు అందకుండా ఉండేందుకు పలురకాల ఆంక్ష లు పెడుతున్న ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. ప్రజా సమస్యలపై సీపీఐ నిరంతరం పోరాడు తుందన్నారు. సభలో జిల్లా సహాయ కార్యదర్శి తన్నీరు సింగరకొండ, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రదాన కార్యదర్శి కె.సుబ్బారావు, జేబీ శ్రీధర్, పి.నాగేంద్రబాబు, మండల నేతలు గల్లా వెంకటప్పయ్య, నిమ్మల అప్పారావు, అట్లూరి శ్రీనివాసరావు, నాగబోయిన శివయ్య, ఉయ్యాల బాబు తదితరులు పాల్గొన్నారు.
గొల్లపూడిని పరామర్శించిన వెంకయ్య
పంగులూరు, ఆగస్టు 4: సీపీఐ అద్దంకి ఏరియా సీనియర్ నాయకు డు గొల్లసూడి వెంకటేశ్వర్లును అఖిలభారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య గురువారం పరామర్శించారు. మండలం లోని తూర్పుకొప్పెరపాడు గ్రామంలో ఆరోగ్యం సరిగాలేక ఇంటికే పరి మితమై విశ్రాంతి తీసుకుంటున్న గొల్లపూడిని ఆయన పరామర్శించా రు. గొల్లపూడి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న వెంకయ్య వైద్యుల సలహాలు పాటిస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. మెరు గైన వైద్యం కోసం మంచి వైద్యశాలలో చూయించుకోవాలని కోరారు. ఆయన వెంట సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తన్నీరు శింగరకొండ, బోడావుల వీరాంజనేయులు ఉన్నారు.
Updated Date - 2022-08-05T05:07:31+05:30 IST