ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్ష్మణ్‌పై వేటు!

ABN, First Publish Date - 2022-10-07T05:38:21+05:30

రవితేజ హత్య అనంతరం నెలకొన్న శాంతిభద్రతల వైఫల్యం సింగరాయకొండ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణ్‌ బదిలీకి కారణమైంది. ఈ మేరకు ప్రస్తుతం బాపట్ల జిల్లా ఇంకొల్లు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రంగనాఽథ్‌ను అక్కడ నియమించారు. ఆయన శనివారం బాధ్యతలు తీసుకుంటారని సమాచారం. ఇటీవల సింగరాయకొండలో వైసీపీ యువనాయకుడు, రౌడీషీటర్‌ రవితేజ హత్యకు గురయ్యారు.

సీఐ లక్ష్మణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింగరాయకొండ సీఐగా రంగనాథ్‌

హత్యకేసులో ఆరోపణలే కారణం

ఒంగోలు(క్రైం), అక్టోబరు 6: రవితేజ హత్య అనంతరం నెలకొన్న శాంతిభద్రతల వైఫల్యం సింగరాయకొండ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణ్‌ బదిలీకి కారణమైంది. ఈ మేరకు ప్రస్తుతం బాపట్ల జిల్లా ఇంకొల్లు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రంగనాఽథ్‌ను అక్కడ నియమించారు. ఆయన శనివారం బాధ్యతలు తీసుకుంటారని సమాచారం. ఇటీవల సింగరాయకొండలో వైసీపీ యువనాయకుడు, రౌడీషీటర్‌ రవితేజ హత్యకు గురయ్యారు. దీంతో అతని బంధువులు, స్నేహితులు ఆగ్రహంతో పోలీసు స్టేషన్‌కు చేరుకుని విధ్వంసం సృష్టించారు. స్టేషన్‌ ఎదుట ఉన్న చలివేంద్రం, లోపల ఉన్న లారీని తగలబెట్టారు. అంతేకాకుండా సీఐ లక్ష్మణ్‌ వలన తమకు అన్యాయం జరుగుతుందని వారు బహిరంగంగానే విమర్శలు చేశారు. దీంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై ప్రత్యేక దృష్టిసారించారు. కేసు విచారణ అధికారిగా లక్ష్మణ్‌ను తప్పించి ప్రస్తుతం డీటీసీ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న సీతారామయ్యను నియమించారు. అదేవిధంగా వెంటనే లక్ష్మణ్‌పై బదిలీ వేటు పడింది. ఈ ఘటనలు ఆయనపై వచ్చిన ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి. అంతేకాకుండా ఆయనను వీఆర్‌కు పిలిచారు.


Updated Date - 2022-10-07T05:38:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising