ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పింఛన్‌ అడిగేందుకు వెళ్లిన వారిపై దౌర్జన్యం

ABN, First Publish Date - 2022-08-13T06:42:41+05:30

పింఛన్‌ మంజూరు కాకపోవడానికి కారణం ఏమిటని నిల దీసిన ఓ వితంతువు ఆమె సోదరి కుమారుడిపై సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ దౌర్జన్యానికి దిగాడు.

నిరసన తెలుపుతున్న బాధితుని బంధువులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వర్ణ (పర్చూరు), ఆగస్టు 12 : పింఛన్‌ మంజూరు కాకపోవడానికి కారణం ఏమిటని నిల దీసిన ఓ వితంతువు ఆమె సోదరి కుమారుడిపై సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ దౌర్జన్యానికి దిగాడు. సెల్‌ఫోన్‌ లాక్కోవడంతో పాటు ఆ యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. అందుకు నిరసనగా బాధితుల బంధువులు సచి వాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సంఘ టన కారంచేడు మండలం స్వర్ణ సచివాలయం-2 వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. స్వర్ణ గ్రామానికి చెందిన కాటి సునీత భర్త వెంకటేశ్వర్లు ఆరు నెలల క్రితం మృతిచెందాడు. ఆమె వింతంతు ఫించన్‌ కోసం గ్రామంలోని సచివాలయం-2లో వలంటీర్‌ అనిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకొంది. ఆరు నెలలు గడుస్తున్నా పింఛన్‌ రాకపోవడంతో శుక్రవారం తన సోదరి కుమారుడు కట్టా ఆనంద్‌బాబుతో కలసి సచివాలయానికి వెళ్లారు. గతంలో ఆమె స్పందనలో కూడా అర్జీ ఇచ్చి ఉన్నారు. దీనికి సంబంఽధించి వెరిఫికేషన్‌ కోసం సంబంధిత పత్రా లతో కార్యాలయానికి వెళ్లి పింఛన్‌ గురించి ప్రశ్నించారు. ఈ సమయంలో డిజిటల్‌ అసిస్టెం ట్‌ కిషోర్‌ బాధ్యతారహితంగా ప్రవర్తించడంతో ఆనంద్‌బాబు వీడియో తీసే ప్రయత్నం చేశారు. దీంతో కిషోర్‌బాబు దౌర్జాన్యానికి దిగాడు. తన సెల్‌ఫోన్‌ను లాక్కొని తనపై దాడికి పాల్పడ్డారని ఆనంద్‌ ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాధితురాలి తరఫు బంధువులు కార్యాలయం వద్దకు చేరుకొని డిజిటల్‌ అసిస్టెంట్‌, వలంటీర్‌పై చర్యలు తీసుకోవాలని ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. సమా చారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సచివాలయం వద్దకు చేరుకొని ఆందోళనను విరమింపజేశారు. దీనిపై బాధితులు స్థానిక పోలీసులతోపాటు, ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్ధానిక డిజిటల్‌ అసిస్టెంట్‌ కిషోర్‌ను విరవరణ కోరగా ఆధార్‌కార్డు, రేషన్‌కార్డుల్లో పేరు మార్పుల వల్ల పింఛన్‌ మంజూరు కాలేదన్నారు. దీనిని సవరించుకోవాలని సూచించామన్నారు.

Updated Date - 2022-08-13T06:42:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising