ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈనెలలోనూ ఉచిత రేషన్‌ లేనట్లే!

ABN, First Publish Date - 2022-06-16T07:24:55+05:30

కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం ఉచితంగా తెల్ల రేషన్‌ కార్డుదారులకు ఇచ్చే బియ్యం జూన్‌లోనూ లేనట్లుగా కనిపిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కేంద్రం కోటాగా ఇచ్చే బియ్యంపై సందిగ్ధం

 మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి

ఒంగోలు (కలెక్టరేట్‌), జూన్‌ 15: కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం ఉచితంగా తెల్ల రేషన్‌ కార్డుదారులకు ఇచ్చే బియ్యం జూన్‌లోనూ లేనట్లుగా కనిపిస్తోంది. గత మూడు నెలల నుంచి కేంద్రం ఉచిత బియ్యం కేటాయింపులు చేయకపోవడంతో సందిగ్ధం నెలకొంది. 2020 మార్చిలో కరోనా విపత్కర పరిస్థితులు నెలకొనడంతో దేశంలో అర్హులైన కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర కేబినెట్‌లో తీర్మానించి ఆ విధంగానే పంపిణీ  చేస్తూ వచ్చింది. ఈ  ఏడాది మార్చిలో ఆ ప్రక్రియ ముగియడంతో ఏప్రిల్‌ నుంచి మరో ఆరునెలల పాటు పొడిగించింది. అయితే వివిధ కారణాలతో ఏప్రిల్‌లో ఇవ్వని కేంద్రం మేలో ఏప్రిల్‌, మే నెలవి కలిపి ఒకేసారి ఇస్తామని ప్రకటించింది. అయినా ఇంతవరకు ఆ బియ్యం పంపిణీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే రేషన్‌షాపుల ద్వారా ఈనెల 18వతేదీ నుంచి తెల్లరేషన్‌ కార్డుదారులకు ఉచితబియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా ఇంతవరకు పౌరసరఫరాల శాఖ అధికారులకు  ప్రభుత్వం నుంచి   స్పష్టత రాలేదు.


జిల్లాలో 6.55లక్షల మంది తెల్లకార్డుదారులు

జిల్లాల విభజన అనంతరం జిల్లాలో 6,55,470 తెల్లరేషన్‌ కార్డులు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. అయితే గత మూడు నెలల నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేయకపోవడంతో కార్డుదారులు రేషన్‌షాపుల చుట్టూ తిరుగుతున్నారు. ఈనెలలో పంపిణీ ఉందా లేదా అనేది ఇంతవరకు డీలర్లకు కూడా ఉన్నతాధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో ఏమీ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.


బీజేపీ నేతల ఫిర్యాదులతోనే  కేంద్రం నిలుపుదల చేసిందా...

రాష్ట్రంతోపాటు జిల్లాలో కేంద్రం ఉచితంగా ఇస్తున్న రేషన్‌బియ్యాన్ని అధికారపార్టీ నాయకులు అక్రమంగా ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. మార్కాపురం ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ వాహనాన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆ సమయంలో బీజేపీ నేతలపై కూడా కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన బీజేపీ నాయకులు ఉచిత బియ్యం అక్రమ వ్యాపారాలపై కేంద్ర ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. దీని కారణంగా కేంద్రం ఉచిత బియ్యాన్ని రాష్ట్రంలో నిలుపుదల చేసి విచారణకు ఆదేశించిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. 


Updated Date - 2022-06-16T07:24:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising