ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ ఏదీ?

ABN, First Publish Date - 2022-09-27T07:22:00+05:30

‘బహిరంగ మల, మూత్ర విసర్జన చేయకండి..మరుగుదొడ్డలను వాడండి.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి..’ అని ప్రతి సమావేశాలల్లో నీతి మాటలు చెప్పే అధికారులు ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహిరిస్తున్నారు.

కోర్టు సముదాయాల ప్రజా మరుగుదొడ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపీడీవో కార్యాలయం వద్ద  ఏడాదిగా నిరుపయోగం

పట్టణంలోనూ పర్యవేక్షణ లేక అదే దుస్థితి

అద్దంకిటౌన్‌, సెప్టెంబరు 26: ‘బహిరంగ మల, మూత్ర విసర్జన చేయకండి..మరుగుదొడ్డలను వాడండి.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి..’ అని ప్రతి సమావేశాలల్లో నీతి మాటలు చెప్పే అధికారులు ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహిరిస్తున్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల నిర్వహణను గాలికి వదిలేయడంతో అవి అధ్వా నంగా తయారయ్యాయి.  దీంతో ఆయా కార్యాలయాలకు, పట్టణాలకు వచ్చే ప్రజలు కనీసం మూత్ర విసర్జనకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అద్దంకి పట్టణంలో నెలకొంది. 

అద్దంకి నగర పంచాయతీ పరిధిలో

అద్దంకి నగర పంచాయతీ పరిధిలోని కోర్టు సముదాయాల వద్ద మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా లక్షల రూపాయలు ఖర్చుచేసి మరుగుదొడ్లును నిర్మించారు. అ యితే వాటికి అన్ని వసతులు ఏర్పాటు చేసినప్పటికీ వాటి నిర్వహణను సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. కోర్టుకు వివిధ ప్రాంతాల నుండి రోజు వందల మంది వస్తుంటారు. మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉండడంతో అక్కడకు వచ్చిన ప్రజలు, ప్రధానంగా మహిళలు కనీసం మూత్ర విసర్జనకు కూడా వసతి లేక ఇబ్బంది పడాల్సిన పరి స్థితి అక్కడ నెలకొంది. 

ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో...

అద్దంకి ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్మించిన  ప్రజా మరుగుదొడ్లు ఏడాదిగా నిరుపయోగంగా ఉన్నాయి. లక్షల రూపాయలు వెచ్చించి వీటిని నిర్మించారు. మరమత్తులకు గురైన పట్టించుకోక పోవడంతో ఏడాదిగా అవి నిరుప యోగంగా ఉన్నాయి. దీంతో  మండలంలోని  వివిధ గ్రామా ల నుంచి కార్యాలయాలకు  వచ్చే ప్రజలు, అధికారులు మరుగుదొడ్డి వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి మరుగు దొడ్లను మరమత్తులు చేయించడంతో పాటు నిర్వహణపై దృష్టిపెట్టి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-09-27T07:22:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising