ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్‌ లాంటి నటుడిని సినీ చరిత్రలో చూడలేం!

ABN, First Publish Date - 2022-11-18T23:55:23+05:30

ఎన్టీఆర్‌ లాంటి నటుడిని సినీ చరిత్ర లో, భవిష్యత్‌లోనూ చూడలేమని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అ న్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అద్దంకి, నవంబరు 19: ఎన్టీఆర్‌ లాంటి నటుడిని సినీ చరిత్ర లో, భవిష్యత్‌లోనూ చూడలేమని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అ న్నారు. ఎన్టీఆర్‌ కళాప రిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణచైతన్య మా ట్లాడుతూ ఎన్టీఆర్‌ అవినీతి రహితంగా పాలన చేశారన్నారు. పేద ప్ర జల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేసిన ఘనత ఎన్టీఆర్‌దే నని అన్నారు. చిన్నతనంలోనే ఎన్టీఆర్‌ను దగ్గర నుంచి చూడటం జరిగిందన్నారు. పార్టీ స్థాపించి అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్‌ కళాపరిషత్‌ అధ్యక్షుడు ఈదర హరిబాబు, నందమూరి కళాపరిషత్‌ అధ్యక్షుడు మ న్నం త్రిమూర్తులు, జనచైతన్య వేదిక కన్వీనర్‌ అన్నమనేని వెంకట రావు, చెన్నుపల్లి నాగేశ్వరరావు, వీరవల్లి రుద్రయ్య, శేషారెడ్డి, చెన్ను పాటి రామాంజనేయులు, జ్యోతి హనుమంతరావు, దేసు పద్మేష్‌, కాకా ని రాధాకృష్ణమూర్తి, కొల్లా భువనేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

సినీమా పరిశ్రమలో మహిళా నటులు ఎదుర్కొంటున్న కష్టాలను జ్ఞానపీఠ అవార్డు గ్రహిత రావూరి భరద్వాజ రచించిన పాకుడురాళ్ళు నాటకాన్ని హైదరాబాద్‌ కళాకారులు నస్రీన్‌ ఇసాక్‌ దర్శకత్వంలో ప్రే క్షకులకు కళ్ళకు కట్టినట్లు చూపించారు. కొణిదెనకు చెందిన శ్రీ వెం కటేశ్వరస్వామి కోలాట సమాజముచే ప్రదర్శించిన కోలాటం, శ్రీ చైతన్య స్కూల్‌ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, డాన్స్‌ పోటీలు అల రించాయి.

Updated Date - 2022-11-18T23:55:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising