పన్నుల పెంపుతో అన్ని వర్గాలపై భారం
ABN, First Publish Date - 2022-10-08T04:20:36+05:30
ఆస్తి పన్ను పెంపుతో అన్ని వర్గాల ప్రజలపై పెను భారం పడుతుందని టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు చిన్ని శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ అద్దంకి పట్టణ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవార ం రాత్రి పట్టణంలో 6,10 వార్డుల పరిధిలోని రామ్‌నగర్, శ్రీనగర్, కొత్తపసుమర్తిపాలెం తదితర ప్రాంతాలలో నాయకులు ఇంటింటికీ తిరిగి వైసీపీ ప్రభుత్వం గత మూడున్నర సంవత్సరాలలో ప్రజలపై మోపిన భారాన్ని వివరిస్తూ కర పత్రాలు పంపిణీ చేశారు.
బాదుడే బాదుడులో టీడీపీ నేతలు, కార్యకర్తలు
అద్దంకి, అక్టోబరు7: ఆస్తి పన్ను పెంపుతో అన్ని వర్గాల ప్రజలపై పెను భారం పడుతుందని టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు చిన్ని శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ అద్దంకి పట్టణ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవార ం రాత్రి పట్టణంలో 6,10 వార్డుల పరిధిలోని రామ్‌నగర్, శ్రీనగర్, కొత్తపసుమర్తిపాలెం తదితర ప్రాంతాలలో నాయకులు ఇంటింటికీ తిరిగి వైసీపీ ప్రభుత్వం గత మూడున్నర సంవత్సరాలలో ప్రజలపై మోపిన భారాన్ని వివరిస్తూ కర పత్రాలు పంపిణీ చేశారు. విద్యుత్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ఽధరలు, డీజిల్, పెట్రోల్ ధరల పెంపుతో అన్ని వర్గాల ప్రజలపై తీరని భారం పడిందన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారన్నారు. బాదుడే బాదుడు కార్య క్రమంలో పట్టణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్లస్టర్ ఇన్‌చార్జిలు కుందారపు రామారావు, కాకాని అశోక్, వడ్డవల్లి పూర్ణచంద్రరావు, ధర్మవరపు నాగేశ్వరరావు, గట్టుపల్లి రామారావు, గార్లపాటి శ్రీనివాసరావు, చుండూరి మురళీసుధాకర్, నర్రా రవీంద్ర, మన్నం త్రిమూర్తులు, కోనేటి అనిల్, కౌన్సిలర్ లు కంపా రజనీ, మాగులూరి తిరుపతమ్మ, రంగిశెట్టి సుభాషిణి, జహీరా, యర్రాకుల రామాంజనేయులు, సామ్యూల్, విజయకుమార్, శ్రీదేవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-08T04:20:36+05:30 IST