ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ విధానాలతో వ్యవసాయం కుదేలు

ABN, First Publish Date - 2022-10-04T06:38:12+05:30

ప్రధానమంత్రి మోదీ విధానాలతోనే వ్యవసాయరంగం పూర్తిగా కుదేలైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, కౌలు రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.శ్రీనివాసరావు విమ ర్శించారు.

కౌలు రైతుల సంఘం జిల్లా మహాసభలో మాట్లాడుతున్న వి.శ్రీనివాసరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలి

బ్యాంక్‌ల నుంచి పూర్తిస్థాయిలో రుణాలివ్వాలి 

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు 

నాగులుప్పలపాడు(ఒంగోలు రూరల్‌), అక్టోబరు 3 : ప్రధానమంత్రి మోదీ విధానాలతోనే వ్యవసాయరంగం పూర్తిగా కుదేలైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, కౌలు రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.శ్రీనివాసరావు విమ ర్శించారు. మండలంలోని ఉప్పుగుండూరు కాపు కల్యాణమం డపంలో సోమవారం జిల్లా కౌలురైతుల 4వ మహాసభ జరిగింది. అందులో పాల్గొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వ విధానాలతో వ్యవసాయం అంటేనే రైతులు భయపడే పరిస్థితులు వచ్చాయన్నారు. బ్యాంక్‌లలో కౌలురైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింద న్నారు. వారికి గుర్తింపుకార్డులు కూడా ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఒడిదొడుకులతో పంటలు పండించినప్పటికీ గిట్టుబాటు ధరలు లేకపోవటంతో నష్టాలపాలవుతున్నారని తెలిపారు. కౌలురైతులను కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదన్నారు. గుర్తింపుకార్డు లతోపాటు బ్యాంక్‌ల నుంచి పూర్తిగా రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కౌలురైతులకు పథకాలు అమలు చేయకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జె. జయంత్‌బాబు అధ్యక్షతన జరిగిన సభలో  సంఘ రాష్ట్రకార్యదర్శి ఎ.హరి బాబు, జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు కంకణాల ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌలురైతు సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్‌కే మాబు, వి.బాలకోటయ్య, సహాయకార్యదర్శిగా టి.శ్రీకాంత్‌, కోశాధికారితోపాటు 11మంది సంఘ సభ్యులను ఎన్నుకున్నారు. 




---------------------------------------------------------------------------------

Updated Date - 2022-10-04T06:38:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising