ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అద్దంకిని ప్రకాశం జిల్లాలోనే ఉంచాలి

ABN, First Publish Date - 2022-01-29T05:49:32+05:30

ప్రజల అభిప్రాయం తీ సుకోకుండా, ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లే కుండా అగమేఘాల మీద జిల్లాల ఏర్పాటు వల్ల ప్రయోజనం ఉండదని, ప్రభుత్వం తీసుకున్న ని ర్ణయంతో అద్దంకి నియోజకవర్గానికి తీరని న ష్టం జరుగుతుందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సమస్యలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే జిల్లాల ప్రస్తావన

ఎమ్మెల్యే రవికుమార్‌ ధ్వజం


అద్దంకి, జనవరి 28: ప్రజల అభిప్రాయం తీ సుకోకుండా, ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లే కుండా అగమేఘాల మీద జిల్లాల ఏర్పాటు వల్ల ప్రయోజనం ఉండదని,  ప్రభుత్వం తీసుకున్న ని ర్ణయంతో అద్దంకి నియోజకవర్గానికి తీరని  న ష్టం జరుగుతుందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. అద్దంకి నియోజకవర్గం 120 కి. మీ దూరంలో ఉన్న బాపట్ల జిల్లాలో కలపటం వ ల్ల ప్రజలకు ఇబ్బందులు ఉంటాయన్నారు. చీరా ల డివిజన్‌లో కలపటం వల్ల అటు జిల్లా, ఇటు డివిజన్‌ రెండూ దూరంగా ఉంటాయన్నారు. ప్ర భుత్వం తొలుత రెవెన్యూ డివిజన్‌ల విషయంలో స్పష్టత తీసుకొని సమీప ప్రాంతాలను రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేసి జిల్లాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి జిల్లాల ప్రకటన చే యాలని, అలా కాకుండా పేపర్‌ల మీద చెప్పుకోటానికే జిల్లాలు చేయటం వల్ల ప్రయోజనం ఏ మి ఉండదన్నారు. రాష్ట్రంలో సమస్యలు అనేకం ఉన్నా వాటి పరిష్కారం కోసం కృషి చేయకుండా ప్రజల దృష్టి  మరల్చేందుకు ప్రభుత్వం కొత్త జి ల్లాలు, డివిజన్‌ల ప్రతిపాదన తీసుకువచ్చిందన్నారు. అద్దంకిని ఒంగోలు డివిజన్‌లోనే ఉంచి ప్రకాశం జిల్లాలో కొనసాగించాలని ఎమ్మెల్యే రవికుమార్‌ ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2022-01-29T05:49:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising