ఆదర్శం ప్రకాశం పంతులు జీవితం
ABN, First Publish Date - 2022-08-24T04:56:10+05:30
ప్రకాశం పంతులు జీవితం అందరికి ఆదర్శం అని ఆయన మునిమనుమరాలు సుభాషిణి అన్నారు.
అద్దంకి, ఆగస్టు 23: ప్రకాశం పంతులు జీవితం అందరికి ఆదర్శం అని ఆయన మునిమనుమరాలు సుభాషిణి అన్నారు. ప్రకాశం పంతు లు జయంతి సందర్భంగా అద్దంకిలో మంగళవారం పలు సాహితీ సం స్థల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాలలో సుభాషిణి పా ల్గొన్నారు. రోటరీక్లబ్ ఆఫ్ శింగరకొండ, శ్రీ ఆంధ్రకేసరి ప్రకాశం మిత్ర మండలి ఆధ్వర్యంలో స్థానిక బంగ్లా రోడ్డులో ప్రకాశం పంతులు వి గ్రహానికి, గ్రంథాలయంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. ఇటీవల నిర్వహించిన పలు విభాగాల లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సుభాషిణి బహుమతులు అంద జేశారు. ఈ సందర్భంగా సుభాషిణి మాట్లాడుతూ విద్యార్థులు, యువ త దేశభక్తిని అలవరచుకోవాలన్నారు. దేశ స్వాతం త్య్రకోసం ప్రాణాలు అర్పించిన నేతల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
కార్యక్రమాలలో సాహితీ సంస్థల ప్రతినిధులు వీరవల్లి సుబ్బారావు, నర్రా శ్రీలక్ష్మి, జాగర్లమూ డి శివకుమారి, ఇలపావు లూరి శేషతల్పసాయి, షేక్ మహ్మద్‌రఫి, వూటు కూరు రామకోటేశ్వర రా వు, పుట్టంరాజు శ్రీరామ చంద్రమూర్తి, దివాకర్ ద త్, కిరణ్, సందిరెడ్డి శ్రీని వాసరావు, చిన్ని మురళీ కృష్ణ, తమ్మన శ్రీనివాసరా వు, బాలసుబ్రహ్మణ్యం, కొల్లా భువనేశ్వరి, డీవీ ఎం సత్యనారాయణ, వ లి, కృష్ణారావు తదితరు లు పాల్గొన్నారు.
చీరాల: నేటి తరం నా యకులు పార్టీలకు అతీతంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులును ఆదర్శంగా తీసుకోవాలని పలువురు సీనియర్ సిటిజన్స్ పేర్కొన్నారు. మంగళవారం పేరాలలోని ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్ర కాశం పంతులు అభి మానులు అన్నంరాజు సుబ్బా రావు తదితరు లు మాట్లాడుతూ ఆం ధ్రకేసరి స్పూర్తిని నేటి యువత మార్గదర్శ కంగా తీసుకునేవిధం గా పెద్దలు ప్రోత్సహిం చాల్సిన అవసరం ఉం దన్నారు. ఆయన జ యంతి సందర్భంగా ని ర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు వడలి రాధాకృష్ణ బహు మతులు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ కొత్తపల్లి వెంకటే శ్వర్లు, గంగవరపు ప్రసాద్, బందా వెంకటకృష్ణశక్తిధర, సర్విశెట్టి సుబ్బరా మయ్య తదితరులు పాల్గొన్నారు.
చినగంజాం: మండలంలోని ము న్నంవారిపాలెం మండల పరిషత్ ప్రా థమిక పాఠశాలలో ప్రకాశం పంతు లు 151వ జయంతిని ఘనంగా నిర్వ హించారు. ప్రకాశం పంతులు చిత్రప టానికి పూలమాలలు వేసి ఉపాధ్యా యులు, విద్యార్థులు నివాళులర్పిం చారు.
ఆంధ్రకేసరి ఆశయాలను విద్యార్థు లు ఆదర ్శంగా తీసుకోవాలని, ఆయన దేశానికి చేసి న సేవలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఎన్.చంద్రశేఖర్, ఉపాధ్యాయులు ఎస్.నాగమ ల్లేశ్వరరావు, బి.నాగకుమారి, పి.హిమవంతేశ్వరి, విద్యార్థులు పాల్గొ న్నారు.
Updated Date - 2022-08-24T04:56:10+05:30 IST