ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పందనను సీరియ్‌సగా తీసుకోకపోతే చర్యలు

ABN, First Publish Date - 2022-06-28T05:20:24+05:30

స్పందన కార్యక్రమాన్ని సీరియ్‌సగా తీసుకోకపోతే చర్యలు తప్పవని కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారం డయల్‌ యువర్‌ కలెక్టర్‌ అనంతరం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మండల స్థాయి అధికారులు స్పందన కార్యక్రమాన్ని సీరియ్‌సగా తీసుకోవాలన్నారు. ఉదయం 10.30 గంటలకల్లా సంబంధిత అధికారులందరూ పాల్గొని సంతకాలు చేసిన నివేదికను తనకు పంపించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

స్పందనలో అర్జీదారుల సమస్యలపై మాట్లాడుతున్న ్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ హెచ్చరిక

ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 27 : స్పందన కార్యక్రమాన్ని సీరియ్‌సగా తీసుకోకపోతే చర్యలు తప్పవని కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారం డయల్‌ యువర్‌ కలెక్టర్‌ అనంతరం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మండల స్థాయి అధికారులు స్పందన కార్యక్రమాన్ని సీరియ్‌సగా తీసుకోవాలన్నారు. ఉదయం 10.30 గంటలకల్లా సంబంధిత అధికారులందరూ పాల్గొని  సంతకాలు చేసిన నివేదికను తనకు పంపించాలని కలెక్టర్‌ ఆదేశించారు. స్పందన పట్ల మండలస్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆయా శాఖల ఉన్నతాధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. కింది స్థాయి అధికారుల పనితీరు, ప్రవర్తనను జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షించాలన్నారు. స్పందన అర్జీలు క్షేత్రస్థాయిలోనే పరిష్కారం కావాలని, అర్జీలను సహేతుంగా పరిష్కరించాలన్నారు. రీ  ఓపెన్‌ కేసులు ఒక శాతంలోపే ఉండాలని తెలిపారు. అత్యంతక్లిష్టమైన కేసులు మాత్రమే జిల్లా స్థాయికి రావాలని సూచించారు. గ్రీవెన్స్‌సెల్‌లో జాయింట్‌ కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌, డీఆర్వో పులి శ్రీనివాసులుతో పాటు పలు శాఖల అదికారులు పాల్గొన్నారు. 

- తన తాత పేరుమీద ఉన్న ఆస్తికి వేరు వేరుగా అసె్‌సమెంట్‌ నెంబర్లతో మునిసిపల్‌ అధికారులు రెండు పన్నులు వసూలు చేస్తున్నారని ఒంగోలులోని  గాంధీరోడ్డుకు చెందిన సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. దీనిపై అనేక సార్లు అధికారులను కలిసి విన్నవించినా న్యాయం జరగడంలేదన్నారు. ఇలా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలుపలు రకాల సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. 

 

Updated Date - 2022-06-28T05:20:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising