పక్కాగా పంట నష్టం అంచనాలు
ABN, First Publish Date - 2022-12-15T01:20:05+05:30
మాండస్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలను పక్కాగా తయారు చేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి లోపాలకు తావులేకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
దెబ్బతిన్న పంటల పరిశీలన
టంగుటూరు, డిసెంబరు 14 : మాండస్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలను పక్కాగా తయారు చేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి లోపాలకు తావులేకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అక్రమా లు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. బుధవారం ఆయన మండలంలోని మర్లపాడు, కందులూరు, మల్లవర ప్పాడు గ్రామాల్లో పర్యటించారు. తుఫాన్‌కు దెబ్బతిన్న మినుము, పొగాకు, శనగ పంటలను పరిశీలించారు. ఆయా నేలల స్వభావం, పంటలు సాగు చేసిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసు కున్నారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పొగాకు రైతుల విషయమై బోర్డు అధికారులతో చర్చించి తగిన న్యాయం చేయాలని వ్యవసాయాధికారులకు సూచించారు. అనంతరం పంట నష్టం అంచనాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఏవో శ్రీనివాసరావు, జిల్లా ఉద్యానవన అధికారి గోపీ చంద్, డాట్ సెంటర్ శాస్త్రవేత్త వరప్రసాద్, ఏడీఏ రమేష్ బాబు, వైసీపీ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు, తహసీల్దార్లు పి.మురళి, చిరంజీవి, ఏవో స్వర్ణలత పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T01:20:06+05:30 IST