యువకుడి ఆత్మహత్యాయత్నం
ABN, First Publish Date - 2022-10-07T06:34:02+05:30
ఆత్మహత్యకు యత్నించిన యువకుడి ప్రాణాలను ఒంగోలు టూటౌన్ పోలీసులు కాపాడారు.
కాపాడిన పోలీసులు
ఒంగోలు(క్రైం), అక్టోబరు 6: ఆత్మహత్యకు యత్నించిన యువకుడి ప్రాణాలను ఒంగోలు టూటౌన్ పోలీసులు కాపాడారు. సంతనూతలపాడు మండలం చిలకపాడు కు చెందిన యువకుడు మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమలో కుటుంబసభ్యులు వా రించడంతో బుఽధవారం మనస్థాపానికి గురై తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంటు న్నాని కుంటుంబ సభ్యులకు వీడియోకాల్ ద్వారా చెప్పాడు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సెల్‌ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసి ఒంగోలు డీఎస్పీకి తెలియజేశారు. స్థానిక దశరాజుపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో రైల్వే ట్రాక్ పైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడుతున్నాడని డైల్ 100 ద్వారా సమా చారం అందుకున్న డీఎస్పీ నాగరాజు ఒంగోలు టూటౌన్ ఎస్సై రాజారావును అప్రమ త్తం చేశారు. వెంటనే తన సిబ్బందితో వెళ్లి ఆత్మహత్యయత్నం చేసుకోబోయిన యువ కుడిని రక్షించి వారి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు ఎస్పీ మలికగర్గ్, ఎస్సై రాజారావును, పోలీసు సిబ్బందిని అభినందిచారు.
Updated Date - 2022-10-07T06:34:02+05:30 IST