ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృతజ్ఞతా యాత్రకు ఆత్మీయ స్వాగతం

ABN, First Publish Date - 2022-03-16T06:41:16+05:30

హైకోర్టు తీర్పును గౌరవించి అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలనే నినాదంతో ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు చేపట్టిన పాదయాత్రకు ఆత్మీయ స్వాగతం లభిస్తోంది.

పర్చూరు నుంచి ఇంకొల్లుకు తరలివెళుతున్న పాదయాత్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పర్చూరు/ఇంకొల్లు, మార్చి 15 : హైకోర్టు తీర్పును గౌరవించి అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలనే నినాదంతో  ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు చేపట్టిన పాదయాత్రకు ఆత్మీయ స్వాగతం లభిస్తోంది. తుళ్ళూరు నుంచి తిరుమలకు చేపట్టిన కృతజ్ఞత పాదయాత్ర సోమవారం రాత్రి పర్చూరు చేరుకుంది. పెద్దసంఖ్యలో ప్రజలు ఎదురేగి ఆహ్వానించారు. నాగులపాలెం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. స్థానిక రోటరీ భవనంలో బృందం రాత్రి బస చేసింది. మంగళవారం ఉదయం పాదయాత్రను నాగులపాలెం సర్పంచ్‌ సుధారాణి ప్రారంభించారు. పర్చూరు నుంచి బయల్దేరి దగ్గుబాడు, వంకాయలపాడు మీదుగా ఇంకొల్లు చేరుకున్నారు. మార్గమధ్యంలో గ్రామస్థులు, రైతులు ఆయనతో కలిసి నడిచారు. కార్యక్రమంలో పర్చూరు టీడీపీ నాయకులు కొల్లా శ్రీనివాసరావు (ఫ్యాక్టరీ), అడ్డగడ్డ రాముడు, అడ్డగడ వెంకటేశ్వర్లు, శ్రీరాం వెంకటసుబ్బారావు, దాసి కిరణ్‌, ఎం.కిషోర్‌, పొన్నం శివ, షేక్‌ బాజీ పాల్గొన్నారు.


ఇంకొల్లులో ఘనస్వాగతం

కృతజ్ఞత పాదయాత్ర మంగళవారం ఇంకొల్లు మండలంలోకి చేరుకుంది. వంకాయలపాడు వద్ద పాదయాత్ర బృందానికి టీడీపీ మండల నాయకులు ఘనస్వాగతం పలికారు. స్థానిక ఎస్‌ఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో బస చేశారు. ఇంకొల్లు చేరుకున్న పాదయాత్ర బృందానికి టీడీపీ ఎస్సీ సెల్‌ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు బేతపూడి సురేష్‌బాబు, మండల అధ్యక్షుడు నాయుడు హనుమంతరావు, వీరగంధం ఆంజనేయులు, కరి శ్రీనివాసరావుకు స్వాగతం పలికారు. 



Updated Date - 2022-03-16T06:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising