ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసులకు పతకాల పంట

ABN, First Publish Date - 2022-08-16T04:34:04+05:30

జిల్లా పోలీసులకు పతకాల పంట పండింది. విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకల్లో ఇరువురు పోలీసులు సీఎం జగన్‌ చేతులమీదుగా ఐపీఎం అందుకోవడం పోలీసు శాఖ ప్రతిష్ట పెంచింది.

సీఎం నుంచి మెడల్‌ అందుకుంటున్న పోలీసు అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం చేతుల మీదుగా ఇరువురికి ఐపీఎం 

మరో ఇద్దరికి ఉత్తమసేవా, 12 మందికి సేవా పతకాలు


ఒంగోలు(క్రైం), ఆగస్టు 15 : జిల్లా పోలీసులకు పతకాల పంట పండింది. విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకల్లో ఇరువురు పోలీసులు సీఎం జగన్‌ చేతులమీదుగా ఐపీఎం అందుకోవడం పోలీసు శాఖ ప్రతిష్ట పెంచింది. అదేవిధంగా ఉత్తమసేవా, సేవా పతకాలు మరో 14మంది అందుకోవడంతో జిల్లా పోలీసుల్లో ఆనందానికి అవధులు లేవు. ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ అందుకున్న వారిలో దిశా పోలీసుస్టేషన్‌లో ప్రస్తుతం ఎస్సైగా పనిచేస్తున్న శారాకుమారి, సీసీఎస్‌ పోలీసుస్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విఽధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన ఎలిశెట్టి చంద్రశేఖర్‌లు ఉన్నారు. వారు ఇరువురు సోమవారం సీఎం చేతులమీదుగా ఇండియన్‌ పోలీసు మెడల్‌ అందుకున్నారు. అదేవిధంగా 2021లో ఉత్తమ సేవా పతకానికి అప్పట్లో ఒంగోలు డీఎస్పీగా పనిచేసిన కేవీవీఎన్‌ ప్రసాద్‌, అదేవిధంగా 2021లో ఎస్బీ సీఐగా పనిచేసిన కే వెంకటేశ్వరరావు, ఏఆర్‌ ఎస్సై వీబీ కోటేశ్వరరావు, హెడ్‌కానిస్టేబుల్‌ కే సిలువరాజు, ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఏ ఆంజనేయులు, ఏఎస్సై కె.కోటయ్య, హెడ్‌ కానిస్టేబుల్‌ బి.వేణుగోపాల్‌లు ఉన్నారు. 2022 ఉత్తమ సేవా పతకం ఉగాది పురస్కారానికి ఒంగోలు రూరల్‌ సీఐ ఆర్‌ రాంబాబు, సేవా పతకాలు పొదిలి సీఐ యూ సుధాకర్‌రావు, ఏఎస్సైలు డి.శ్రీనివాసరావు, ఏఆర్‌ ఎస్సై వి.తిరుపతిస్వామి, హెడ్‌ కానిస్టేబుల్‌ జి.పండు వరప్రసాద్‌, కానిస్టేబుల్‌ సీహెచ్‌ వెంకటేశ్వర్లు, ఏఆర్‌ కానిస్టేబుల్‌ బీ కేశవ నారాయణలు ఎంపికయ్యారు. వీరిలో వీబీ కోటేశ్వరరావు, కే సిలువరాజు, డీ శ్రీనివాసరావులు ప్రస్తుతం బాపట్ల జిల్లాలో పనిచేస్తుండగా వారు అక్కడ రివార్డులు అందుకున్నారు. మిగిలిన 11మంది ఒంగోలులో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఇన్‌చార్జి మంత్రి మేరుగ నాగార్జున చేతులమీదుగా పతకాలు అందుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ దినే్‌షకుమార్‌, ఎస్పీ మలికగర్గ్‌లు ఉన్నారు. 

Updated Date - 2022-08-16T04:34:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising