ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాఫిక్‌లో చిక్కుకున్న 108

ABN, First Publish Date - 2022-12-15T23:00:39+05:30

కనిగిరి పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్‌ స మస్య తీవ్రమవుతోంది. గురువా రం అత్యవసరంగా వెళ్తున్నా 108 అంబులెన్స్‌ వాహనం రద్దీలో చిక్కు కుంది. అయినా అధికారులకు చల నం లేదు. పాలకుల నిర్లక్ష్యానికి 108 హ నాలకు కూడా దారి ఇచ్చే పరిస్థి తి ఎదురవుతోందని ప్రజలు అంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తీవ్రమవుతున్న వాహనాల రద్దీ

పట్టించుకోని అధికారులు

కనిగిరి, డిసెంబరు 15 : కనిగిరి పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్‌ స మస్య తీవ్రమవుతోంది. గురువా రం అత్యవసరంగా వెళ్తున్నా 108 అంబులెన్స్‌ వాహనం రద్దీలో చిక్కు కుంది. అయినా అధికారులకు చల నం లేదు. పాలకుల నిర్లక్ష్యానికి 108 హ నాలకు కూడా దారి ఇచ్చే పరిస్థి తి ఎదురవుతోందని ప్రజలు అంటున్నారు. గురువారం మధ్యాహ్నం మండలంలోని చల్లగిరగల ప్రాంతంలో గర్భిణి పురిటి నొప్పులు రావడంతో 108కు సమా చారం అందింది. దీంతో ఆ గ్రామం నుంచి గర్భిణిని ప్రభుత్వాసుపత్రికి తీసుకు వచ్చేందుకు 108 వాహనం బయలుదేరింది. కానీ పామూరు బస్టాండు సెంటరుకు వచ్చేసరికి ట్రాఫిక్‌లో ఇరుక్కు పోయింది. ట్రాఫిక్‌ నియంత్రణ విధులు నిర్వహిస్తు న్న పోలీసు సిబ్బంది 108 వాహనాన్ని పంపిచేందుకు నానా తిప్పలు పడాల్సి వ చ్చింది. దీంతో వాహనదారులు పాలకుల నిర్లక్ష్య వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. పామూరు బస్టాండ్‌ సెంటరులో వాహనాల రద్దీతో పాటు రోడ్డు పైకి వచ్చి పండ్ల దుకాణాలు నిర్వహిస్తున్నా పట్టించుకునే వారే లేరు. పండ్ల దుకాణదారులు ఇచ్చే మామూళ్లు పుచ్చుకుని పోలీసు సిబ్బంది మిన్నకుంటున్నారన్న ఆరోపణలు వ్యక్తమవు తున్నాయి. మున్సిపల్‌ చైర్మన్‌ గఫార్‌ అసమర్ధ పాలనకు ట్రాఫిక్‌ సమస్యలు నిదర్శ నంగా కన్పిస్తున్నాయి. ఫొటోలకు ఫోజులే తప్ప ఆచరణలో మాత్రం చర్యలు శూన్య మని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇకనైనా అధికారులు, పాలకులు పామూరు బస్టాం డ్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-12-15T23:00:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising