ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur: తెలంగాణలో నేను.. ఏపీలో పవన్‌ను సీఎం చేస్తా : కేఏ పాల్

ABN, First Publish Date - 2022-07-31T02:06:35+05:30

చంద్రబాబు (Chandrababu), జగన్ (Jagan), పవన్ (Pawan) కంటే ప్రజల‌ సపోర్ట్ తనకే ఎక్కువ ఉందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు (Guntur): చంద్రబాబు (Chandrababu), జగన్ (Jagan), పవన్ (Pawan) కంటే ప్రజల‌ సపోర్ట్ తనకే ఎక్కువ ఉందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ (Prajashanthi party chief Ka Paul) అన్నారు. ప్రజలు తననే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ ‌సీఎం కేసీఆర్ (Cm Kcr).. ఆంధ్రాలో జగన్ కలిసి పయనిస్తే అభివృద్ధి ఉండేదని.. కాని కలిసి నడవడానికి వారు ససేమిరా అంటున్నారని కేఏ పాల్ చెప్పారు. తెలంగాణలో తనపై దాడి జరగడంతో రాజకీయ చిత్రం మారిపోయిందని పేర్కొన్నారు. ఒక్క దెబ్బతో 30 లక్షల ఓటర్లు తనకు పెరిగారయన్నారు. 


‘‘ దేశంలో శ్రీలంక (Srilanka) పరిస్థితులు రాక ముందే మోదీని గద్జెదించాలి. కేసీఆర్‌ను చిత్తుగా ఓడించాలి. తెలంగాణ నుంచి పోటీ‌ చేస్తా. జగన్‌కు నేను జీవితంలో సపోర్ట్ చేయను. కేసీఆర్‌కు కళ్లు నెత్తి మీదకు వచ్చాయి. కాబోయే తెలంగాణ సీఎంను నేనే. స్పెషల్ ప్యాకేజ్, స్టేటస్ కేంద్రం ఏపీకి  ఇవ్వడం లేదు. నేనే పీఎం అయితే తెలుగు రాష్ట్రాలకు మహర్దశ. జగన్ మూడు సంవత్సరాల్లో‌ అప్పులు మాత్రం చేస్తున్నారు. తమ్ముడు పవన్ నాతో  కలిస్తే  ముఖ్యమంత్రిని చేస్తా. బడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలంటే  ప్రజాశాంతి పార్టీని గెలిపించాలి.’’ అని కేఏ పాల్ సూచించారు. 




Updated Date - 2022-07-31T02:06:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising