ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో పోలీసులకు రక్షణ లేదు

ABN, First Publish Date - 2022-10-03T09:40:28+05:30

‘‘రాష్ట్ర ప్రభుత్వం పోలీసులపై కక్ష కట్టింది. బకాయిలు, టీఏ, డీఏలు... చివరికి సరెండర్‌ లీవ్స్‌ కూడా ఇవ్వలేదు. దసరా పండుగ సందర్భంగానైనా వాటిని ఇవ్వాలి. ఇప్పటివరకు ఈ ప్రభుత్వంలో 358 మంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వం మాపై కక్ష కట్టింది...

ఇప్పటి వరకూ 358 మంది కానిస్టేబుళ్లను డిస్మిస్‌ చేసింది

డిస్మిస్డ్‌ ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాశ్‌

సేవ్‌ పోలీస్‌ సైకిల్‌ యాత్రను అడ్డుకున్న పోలీసులు


అనంతపురం క్రైం, అక్టోబరు 2: ‘‘రాష్ట్ర ప్రభుత్వం పోలీసులపై కక్ష కట్టింది. బకాయిలు, టీఏ, డీఏలు... చివరికి సరెండర్‌ లీవ్స్‌ కూడా ఇవ్వలేదు. దసరా పండుగ సందర్భంగానైనా వాటిని ఇవ్వాలి. ఇప్పటివరకు ఈ ప్రభుత్వంలో 358 మంది కానిస్టేబుళ్లను డిస్మిస్‌ చేసింది. బకాయిలు అడిగినందుకు నన్ను కూడా డిస్మిస్‌ చేశారు. ఈ ప్రభుత్వంలో పోలీసులకు రక్షణ లేదు’’ అని డిస్మిస్డ్‌ ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ అన్నారు. అనంతపురం నగరంలోని ప్రెస్‌క్లబ్‌ నుంచి ఆదివారం ఆయన సైకిల్‌ యాత్రను చేపట్టారు. జాతీయ జెండాను కట్టిన సైకిల్‌కి ఒక ప్లకార్డును తగిలించారు. దానిపై ‘‘ఏపీ సీఎం జగన్‌ సర్‌... సేవ్‌ ఏపీ పోలీస్‌... గ్రాంట్‌, ఎస్‌ఎల్‌ఎస్‌, ఏఎ్‌సఎల్‌ఎస్‌, టీఏ, డీఏ చెల్లించాలి... నన్ను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోండి... సామాజిక న్యాయం పాటించండి’’ అని రాశారు.


ప్రెస్‌క్లబ్‌ నుంచి సుమారు 100 మీటర్లు కూడా రాకముందే టవర్‌ క్లాక్‌ సమీపంలో యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతుండగానే... అనుమతి లేకుండా యాత్ర చేస్తున్నారంటూ అరెస్టు చేశారు. త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌కు ప్రకాశ్‌ను తరలించారు.

Updated Date - 2022-10-03T09:40:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising