ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Polavaram project: ఇవ్వాల్సింది 2,441 కోట్లే!

ABN, First Publish Date - 2022-12-13T03:25:06+05:30

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇక తాము అందించాల్సిన నిధులు రూ.2,441.86 కోట్లు మాత్రమేనని కేంద్రం పునరుద్ఘాటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలవరంలో ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ వరకే నిధులిస్తాం

15,668 కోట్లలో 13,226 కోట్లురీయింబర్స్‌ చేసేశాం

వరదలతో నిర్మాణం మరింత ఆలస్యం

ప్రత్యేక హోదాపైనా కేంద్రం పాత పాటే

హోదా ఉనికిలోనే లేదు

ఆర్థిక సంఘాల సిఫారసుతో

రాష్ట్రాల పన్నుల వాటా పెంచాం

రెవెన్యూ లోటు ఉంటే గ్రాంట్లు ఇస్తున్నాం

రాజ్యసభలో కేంద్ర మంత్రుల స్పష్టీకరణ

న్యూఢిల్లీ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇక తాము అందించాల్సిన నిధులు రూ.2,441.86 కోట్లు మాత్రమేనని కేంద్రం పునరుద్ఘాటించింది. ప్రత్యేక హోదాపైనా పార్లమెంటులో పాతపాటే పాడింది. ఆ అంశం ఉనికిలోనే లేదని ప్రకటించింది. పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా లభించిన తర్వాత ఇరిగేషన్‌ కంపోనెంట్‌కు 100 శాతం నిధులు భరిస్తున్నామని, దాని ప్రకారం రూ.15,668 కోట్ల విలువైన పనులకు మాత్రమే నిధులిస్తామని కేంద్ర జలశక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు స్పష్టంచేశారు. అందులో ఇప్పటి వరకు రూ.13,226.04 కోట్లు రీయింబర్స్‌ చేశామని, ఇక చెల్లించాల్సింది రూ.2441.86 కోట్లు మాత్రమేనని వివరించారు.

రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ వేర్వేరుగా అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సోమవారం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి పోలవరంపై రాష్ట్రప్రభుత్వం రూ.15,97 0.53 కోట్లు ఖర్చు చేసిందని.. అందులో కేంద్రం ఇప్పటి వరకు రూ.13,226.04 కోట్లు రీయింబర్స్‌ చేసిందని.. మరో రూ.483 కోట్ల రీయింబర్స్‌మెంట్‌కు రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని పేర్కొన్నారు. 2013-14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.29,027.25 కోట్లు ఉండగా... 2017-18 ధరల ప్రకారం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా అంచనా వేసినట్లు తెలిపారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. 2019-20 నుంచి ఇప్పటి వరకు రూ.6,461.88 కోట్లు రీయింబర్స్‌ చేశామన్నారు. ఇందులో 2019-20లో రూ.1,850 కోట్లు, 2020-21లో రూ.2,234.2 కోట్లు, 2021-22లో రూ.1,898.8 కోట్లు, 2022-23లో ఇప్పటి వరకు రూ.478.88 కోట్లు రీయింబర్స్‌ చేసినట్లు వివరించారు. కాగా.. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి మరింత ఆలస్యం కావచ్చని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రణాళిక ప్రకారం 2024 మార్చి నాటికి ప్రాజెక్టు, 2024 జూన్‌ నాటికి డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ పూర్తికావలసి ఉందని.. కానీ 2020లోను, ఈ ఏడాదిలో గోదావరి నదికి భారీ వరదలు వచ్చిన నేపథ్యంలో నిర్మాణం ఆలస్యమవుతుందని వెల్లడించారు.

ఆర్థిక సంఘం తేడా చూపలేదు..

జాతీయాభివృద్ధి మండలి గతంలో కొన్ని పరామితులకు లోబడి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చిందని కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి రావు ఇంద్రజిత్‌సింగ్‌ సోమవారం రాజ్యసభలో చెప్పారు. అయితే 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా రాష్ట్రాలకు, సాధారణ కేటగిరీ రాష్ట్రాల మధ్య ఎలాంటి వ్యత్యా సం చూపలేదని.. ప్రణాళిక, ప్రణాళికేతర అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాల పన్నుల వాటాపై సిఫారసులు చేసిందన్నారు. పంజాబ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే యోచన ఉందా అని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సభ్యుడు విక్రమ్‌జిత్‌ సింగ్‌ సహానీ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకే రాష్ట్రాల కు 2015-20 మధ్య పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచామని.. తర్వాత 15వ ఆర్థిక సంఘం కూడా 41 శాతం మేర పన్నుల వాటాకు సిఫారసు చేసిందని గుర్తుచేశారు. నిధు ల పంపిణీ తర్వాత కూడా వనరుల లోటు ఉండే రాష్ట్రాలకు.. రెవెన్యూ లోటు భర్తీకి గ్రాంట్లు అందిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు.

Updated Date - 2022-12-13T03:25:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising