ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్లులో విషం కలిసింది: ఏఎస్పీ కృష్ణకాంత్

ABN, First Publish Date - 2022-02-03T02:36:10+05:30

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్తీ కల్లు ఘటనలో జీలుగు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పు గోదావరి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్తీ కల్లు ఘటనలో జీలుగు కల్లులో విషం కలిసినట్టు ప్రాథమిక విచారణలో గుర్తించామని రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో జీలుగు కల్లు తాగి ఐదుగురు గిరిజనులు మృతి చెందారన్నారు. కల్లులో విషం ఎలా కలిసిందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. 


రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో కల్తీ కల్లు తాగి ఐదుగురు గిరిజనులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడికి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్సను అందిస్తున్నారు. లోదొడ్డిలో కల్తీ కల్లు తాగిన ఐదుగురులో నలుగురు మృతి చెందటంతో గ్రామంలో విషాద చాయలు నెలకొంది. కల్తీ కల్లు తాగి మృతి చెందిన వారిలో వేమ లోవరాజు (28), చెదల సుగ్రీవ్ (70), లు బుసరి సన్యాసిరావు (65), పుత్తూరు గంగరాజు(36)తో పాటు మరొకరు ఉన్నారు.  కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఏసుబాబు పరిస్థితి విషమంగా ఉంది. ఈరోజు ఉదయం కల్తీ కల్లు తాగిన ఐదుగురుకి కడుపులో మంట, వాంతులు అయ్యాయి. అనంతరం కొద్ది సేపటికే ఐదుగురు మృతి చెందారు. కల్తీ కల్లుపై జండంగి పోలీసులు విచారణ చేపట్టారు. 

Updated Date - 2022-02-03T02:36:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising