ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pm Modiకి నల్లబెలూన్లతో నిరసన... ఆరుగురి అరెస్ట్

ABN, First Publish Date - 2022-07-05T03:28:19+05:30

మోదీ ఏపీ పర్యటనలో నల్లబెలూన్ల ఎగురవేత కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బెలూన్లు కాంగ్రెస్ నేతలు ఎగురవేసినట్లు గుర్తించారు. సుంక‌ర ప‌ద్మశ్రీ‌తో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా:  ప్రధాని మోదీ (Pm Modi) ఏపీ (Ap) పర్యటనలో నల్లబెలూన్ల ఎగురవేత కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బెలూన్లు కాంగ్రెస్ నేతలు (Congress Leaders) ఎగురవేసినట్లు గుర్తించారు.  సుంక‌ర ప‌ద్మశ్రీ‌ (Sunkara Padmasri)తో పాటు మ‌రో ముగ్గురను అదుపులోకి తీసుకున్నారు. రాజీవ్‌ ర‌త‌న్‌ (Rajiv Ratan)కు లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేశారు. నిందితుల‌పై ఐపీసీ 353, 341, 188, 145 సెక్షన్ల కింద కేసు న‌మోదు చేశారు. ప్రధాని మోదీ హెలికాప్టర్ వెళ్లిపోయిన 5 నిమిషాల త‌ర్వాత నల్ల బెలూన్లు వ‌చ్చాయ‌ని పోలీసుల వెల్లడించారు.


గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ (Gannavaram Airport)కు 4.5 కి.మీ. దూరంలో ఉన్న సూరంప‌ల్లి నుంచి బెలూన్లు ఎగుర‌వేశార‌ని గుర్తించినట్లు తెలిపారు. ఇదే కేసులో కాంగ్రెస్‌ నేతలకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. బెలూన్లు అందించిన రాజశేఖర్, వీడియో తీసిన రవికాంత్‌ను కూడా అరెస్ట్‌ చేశారు. మొత్తం ఆరుగురు కాంగ్రెస్‌ నేతలను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కాంగ్రెస్‌ నేత రాజీవ్‌రతన్ ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి పరారీ ఉండటంతో ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. 

Updated Date - 2022-07-05T03:28:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising