ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పినిపె విశ్వరూప్

ABN, First Publish Date - 2022-04-12T21:13:21+05:30

రవాణా శాఖ మంత్రిగా పినిపె విశ్వరూప్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయం ఐదో బ్లాక్ మొదటి అంతస్తులో తనకు కేటాయించిన ఛాంబరుకు మంత్రి సతీసమేతంగా వచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రవాణా శాఖ మంత్రిగా పినిపె విశ్వరూప్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు.  సచివాలయం ఐదో బ్లాక్ మొదటి అంతస్తులో తనకు కేటాయించిన ఛాంబరుకు మంత్రి సతీసమేతంగా వచ్చారు. రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, కమిషనర్ కాటమనేని భాస్కర్ మంత్రిని కలిశారు. రవాణా శాఖ మంత్రిగా నియమించినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా  పినిపె విశ్వరూప్  మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఏపీలో దాదాపు 11,271 బస్సులు తిరుగుతున్నాయి. ప్రయాణీకులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు 998 బస్సులను కొత్తగా అద్దెకు తీసుకుంటున్నాం. తిరుమలలో ఎలాంటి కాలుష్యం లేకుండా క్షేత్ర  పవిత్రతను  కాపాడాలనే ఉద్దేశ్యంతో కొత్తగా 100 ఎలక్ట్రిక్ బస్సులు నడపడానికి చర్యలు తీసుకున్నాం. తిరుమలలో మే 15వ తేదీన తొలి ఎలక్ట్రిక్ బస్సు  తిరుమలకు చేరుకోబోతున్నది. కేంద్రప్రభుత్వ సహకారంతో రహదారి భద్రతా ప్రమాణాల ప్రకారం రూ.380 కోట్లతో  పోలీస్, వైద్య, ఆరోగ్య శాఖల సమన్వయంతో త్వరలో చర్యలు తీసుకుంటాం.డీజిల్ రేట్లు పెరగడంతో ఆర్టీసీకి మరింతగా కష్టాలు పెరిగాయి’’ అని మంత్రి పినిపె విశ్వరూప్ తెలిపారు.

Updated Date - 2022-04-12T21:13:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising