ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పింగళి.. తెలుగు జాతికి గర్వకారణం

ABN, First Publish Date - 2022-08-04T09:09:44+05:30

పింగళి.. తెలుగు జాతికి గర్వకారణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారసులను సన్మానించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య, కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి) భారతీయ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య తెలుగు జాతికి గర్వకారణమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. బుధవారం ఢిల్లీలో పింగళి వారసులైన.. పింగళి మనుమరాలు సుశీలా దశరథరామన్‌, ఆమె కుమారుడు పింగళి వెంకయ్య (ముని మనుమడు), ఘంటశాల గోపీకృష్ణ, వాసుదేవ నరసింహన్‌, కృష్ణప్రవీణ్‌, తదితరులు ఉపరాష్ట్రతిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సదర్భంగా వెంకయ్యనాయుడు వారిని శాలువాలతో సత్కరించారు. అనంతరం ఉపరాష్ట్రపతి పింగళి వెంకయ్య సేవలను కొనియాడారు. భారతీయులకు ఓ గుర్తింపు కావాలనే ఆలోచనతో మువ్వన్నెల జాతీయ జెండాను రూపొందించారని, వారి జీవితం అందరికీ ఆదర్శనీయమని తెలిపారు. పింగళి కార్యదీక్ష, దేశభక్తిని యువత దర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి కిషన్‌ రెడ్డి కూడా ఢిల్లీలోని ఆయన నివాసంలో పింగళి వారసులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ జెండా ఉన్నంత రవకు పింగళి వెంకయ్య పేరును దేశ ప్రజలు స్మరించుకుంటారని తెలిపారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15న దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేస్తారని చెప్పారు. త్వరలో అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాలను కాలినడకన సందర్శిస్తానని, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్యతో తన అనుబంధాన్ని పుస్తక రూపకంలో తీసుకొచ్చిన మనుమడు జీవీ నరసింహం.. దానిని కిషన్‌రెడ్డికి బహూకరించారు. 


Updated Date - 2022-08-04T09:09:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising