ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగుతున్న అల్పపీడనం

ABN, First Publish Date - 2022-10-05T03:04:53+05:30

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో కోస్తా తీరానికి సమీపంగా రానున్నది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో కోస్తా తీరానికి సమీపంగా రానున్నది. అల్పపీడనం నుంచి ఉత్తర కోస్తా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ఉత్తరప్రదేశ్‌ వరకు అల్పపీడన ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో మంగళవారం ఉత్తర కోస్తాలో పలుచోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో ఈనెల ఆరో తేదీన భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరకోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

Updated Date - 2022-10-05T03:04:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising