ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలు: పేర్ని నానీ

ABN, First Publish Date - 2022-03-16T20:38:06+05:30

ఏపీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేయనున్నామని మంత్రి పేర్ని నానీ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేయనున్నామని మంత్రి పేర్ని నానీ తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మొత్తంగా 1800లకుపైగా కారుణ్య నియామకాలు గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు మిగిలిన శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వాలని సిఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. ఆయిల్ కంపెనీల నుంచి నెలకు 8 లక్షల లీటర్లు ఆయిల్ వాడుతున్నామని, ఆర్టీసీ కేంద్రం నుంచి కొనే ఆయిల్‌లో ధరల తేడాలో మార్పులు వచ్చాయన్నారు. గతంలో 15 రూపాయలు తేడా ఉండేదని, ఇప్పుడు బయట, బంకుల్లోనే తక్కువ ధరకు దోరుకుతోందన్నారు. దీనితో బయట బంకుల్లో కొనాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కొంటోందన్నారు. తద్వారా కోటి 50 లక్షల రూపాయలు ఇప్పటి వరకు మేలు జరిగిందన్నారు. కేంద్రం ప్రభుత్వం నుంచి కాక బయట కొనడం వల్ల  నెలకు రూ. 33.83 కోట్ల మేలు చేకూరుతుందన్నారు. తిరుమల ఘాట్ రోడ్డు, తిరుపతి నుంచి నెల్లూరు, మదనపల్లికి మొదట ఎలక్ట్రిక్ బస్సులు తిప్పుతామన్నారు. కోవిడ్ దృష్ట్యా ఆర్టీసీలో సీనియర్ సిటిజన్‌లకు ఆపేసిన 25 శాతం రాయితీ ఏప్రిల్ నుంచి పునరుద్ధరిస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

Updated Date - 2022-03-16T20:38:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising