ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Andhra News: ఏపీ ఆర్థిక పరిస్థితిపై లోతైన అధ్యయనం చేయాలి: పయ్యావుల కేశవ్‌

ABN, First Publish Date - 2022-07-20T20:54:49+05:30

ఏపీ ఆర్థిక పరిస్థితిపై లోతైన అధ్యయనం చేయాలని పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): ఏపీ (AP) ఆర్థిక పరిస్థితిపై లోతైన అధ్యయనం చేయాలని పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ (Payyavula Keshav) అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సంక్షేమం కోసమే అప్పు అనేది ఒక బూటకమని అన్నారు. సంక్షేమం అనే ముసుగులో ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక అరాచకం చాలా ఉందని అన్నారు. ఏపీ ప్రభుత్వం (AP Govt.) శ్రీలంక (Sri Lanka) దిశగా సాగుతోందని 4 నెలల నుంచి టీడీపీ (TDP) చెప్తోందన్నారు. ఇదే విషయాన్ని కేంద్రం (Central) మరోసారి చెప్పిందని ఈ సందర్భంగా పయ్యావుల గుర్తు చేశారు.


ఆర్థికమంత్రి సీఏజీ (CAG) పూర్తిస్థాయి ఆడిట్‌కు సిద్ధపడతారా? లేక శ్వేతపత్రం విడుదల చేస్తారా? అని పయ్యావుల కేశవ్‌ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అంతా సక్రమమేనని భావిస్తే..., ప్రత్యేక ఆడిట్‌ (Audit)కు సిద్ధమా?.. ఏపీలో వందలాది పీడీ అకౌంట్లకు (PD Accounts) లెక్కలు లేవు, దీనిని నిరూపించేందుకు తాను సిద్ధమన్నారు. కేంద్రం తప్పిదాలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ (CM KCR) ఎండగడుతుంటే.. వైసీపీ (YCP) ఎందుకు మౌనం వహిస్తోందని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.

Updated Date - 2022-07-20T20:54:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising