ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఏసీలో సీఎం జగన్ మమ్మల్ని బెదిరించారు: పయ్యావుల కేశవ్‌

ABN, First Publish Date - 2022-03-07T20:33:25+05:30

టీడీపీ ఇదే దూకుడును భవిష్యత్తులోనూ కొనసాగిస్తుందని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ ఇదే దూకుడును భవిష్యత్తులోనూ కొనసాగిస్తుందని, ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఎంతవరకైనా వెళ్తామని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. బీఏసీ సమావేశం అనంతరం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అసత్యాలు మాట్లాడితే సస్పెండ్‌ చేస్తామంటూ.. బీఏసీలో సీఎం జగన్ మమ్మల్ని బెదిరించారన్నారు. తాము వేటినీ లెక్కచేయమన్నారు. గవర్నర్‌ని అగౌరవపరచలేదని, రాజ్యాంగ వ్యవస్థల్ని కించపరుస్తున్న గవర్నర్‌ని మాత్రమే గోబ్యాక్‌ అన్నామని తెలిపారు.


వయస్సు గురించి వైసీపీ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని పయ్యావుల అన్నారు. చంద్రబాబును అసెంబ్లీలో అవమానించినప్పుడు.. వైసీపీ నేతలకు వయస్సు గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలకు శాశ్వతంగా హైదరాబాదే రాజధాని అని అన్నారు. నాలుగో రాజధానిగా హైదరాబాద్‌ను పెట్టుకుంటారేమో? అని అనుమానం వ్యక్తం చేశారు. కోర్టు మెట్టికాయలు వేసినా వైసీపీకి బుద్ధి రావడం లేదన్నారు. హైదరాబాద్‌లో కేసీఆర్‌కు సహాయపడేందుకే ఈ కార్యక్రమాలు చేస్తున్నారని, భవిష్యత్తులో శాశ్వతంగా హైదరాబాద్‌లోనే ఉంటారని పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-03-07T20:33:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising