ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pawan Kalyan : కనీసం ఆలివ్ గ్రీన్ చొక్కా అయినా వేసుకోవచ్చా?

ABN, First Publish Date - 2022-12-09T08:58:40+05:30

వారాహి వాహనం రంగులపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi : వారాహి వాహనం రంగులపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కనీసం ఆలివ్ గ్రీన్ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా తన సినిమాలను అడ్డకున్నారని.. ఆపై విశాఖ పర్యటనకు వెళ్తే హోటల్ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. బలవంతంగా తనను విశాఖ నగరం నుంచి పంపించి వేశారని పవన్ పేర్కొన్నారు. మంగళగిరిలో సైతం తను కారులో వెళ్తుంటే అడ్డుకున్నారన్నారు. ఇప్పటం గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న తనను ఆపేశారన్నారు. ఇప్పుడు వాహనం రంగు పైనా వివాదం చేస్తున్నారన్నారు. ఇక పై శ్వాస తీసుకోవటం ఆపేయమంటారా అని పవన్ ఫైర్ అయ్యారు. అయితే పవన్ ఆలివ్ గ్రీన్ కలర్ వెహికిల్ వాడకంపై.. సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ The central motor vehicle rules 1989, చాప్టర్ 121 ప్రకారం ఇండియన్ డిఫెన్స్ విభాగం వారు తప్ప ప్రయివేటు వ్యక్తులు తమ వాహనాలకు అలీవ్ గ్రీన్ కలర్ వాడటం నిషిద్ధమని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు..

Updated Date - 2022-12-09T09:27:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising