ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏకవాక్య తీర్మానం చేస్తే భయపడిపోతారా?: పవన్ కల్యాణ్

ABN, First Publish Date - 2022-04-06T01:58:17+05:30

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు బాధాకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రైతు లేకపోతే జీవనాధారం లేదని,...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు బాధాకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రైతు లేకపోతే జీవనాధారం లేదని, అలాంటి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కనీసం గిట్టుబాటు ధర కూడా ఇవ్వడంలేదని వ్యాఖ్యానించారు. రైతు ఆత్మహత్యలకు కారణం ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. కర్నూల్ జిల్లాలో 353 మంది, అనంతపురంలో 173 మంది, ఉభయ గోదావరి జిల్లాల్లో 85 మంది కౌలు రైతులు చనిపోయారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 


తామంటే వైసీపీకి ఎందుకంత భయమని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఏకవాక్య తీర్మానం చేస్తే భయపడిపోతారా? అని వ్యాఖ్యానించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదంటే భయమా అని పవన్ కల్యాణ్  నిలదీశారు. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి ప్రత్యేక రేట్లకు ఎందుకు అమ్ముతున్నారని పవన్ మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న వ్యక్తులకు ఏం చేయగలమని తాను ఆలోచిస్తానని చెప్పారు. మహానుభావుల త్యాగాలతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని పవన్ గుర్తు చేశారు.




Updated Date - 2022-04-06T01:58:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising