ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇప్పటం గ్రామపంచాయతీకి రూ.50 లక్షలు ప్రకటించిన పవన్‌

ABN, First Publish Date - 2022-03-15T01:04:20+05:30

జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఆవేపూరిత ప్రసంగం చేశారు. పవన్ ప్రసంగించే ముందు జై ఆంధ్ర, జై తెలంగాణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఆవేపూరిత ప్రసంగం చేశారు. పవన్ ప్రసంగించే ముందు జై ఆంధ్ర, జై తెలంగాణ, జై భారత్ అని ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆరంభంలోనే సర్వమతాలను జనసేనాని ప్రస్తావించారు. ఏపీ, తెలంగాణ నుంచి ఆవిర్భావ సభకు తరలివచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. సభ నిర్వహించేందుకు అనుమతిచ్చిన ఇప్పటం రైతులకు పవన్‌ కల్యాణ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఇప్పటం గ్రామపంచాయతీకి రూ.50 లక్షలు ఆయన ప్రకటించారు. జనసైనికులు కొదమ సింహాలై గర్జించాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాలకు అండగా ఉండాలనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విభేదాలుండొచ్చు..వ్యక్తిగత ధ్వేషాలొద్దని పవన్‌ సూచించారు. 


తొమ్మిదేళ్ల కింద జనసేన పార్టీ ఆవిర్భవించింది. 2014 ఎన్నికల్లో పోటీచేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించింది. 2019 ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీ చేసినప్పటికీ కేవ లం ఒక్క స్థానంలో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఆ అనుభవాల దృష్ట్యా ఈసారి పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అది కూడా ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే వ్యూహాలను రూపొందించుకోవాలని యోచిస్తోంది. 

Updated Date - 2022-03-15T01:04:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising