ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Govt Debts: అప్పుల రాష్ట్రంగా ఏపీకి కీర్తి: పట్టాభి

ABN, First Publish Date - 2022-07-23T20:23:06+05:30

దేశంలోనే అత్యధికంగా అప్పుల (Debts) రాష్ట్రంగా ఏపీకి కీర్తి సంపాదించిదని టీడీపీ నేత పట్టాభి (Pattabhi) ఎద్దేవాచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: దేశంలోనే అత్యధికంగా అప్పుల (Debts) రాష్ట్రంగా ఏపీకి కీర్తి సంపాదించిదని టీడీపీ నేత పట్టాభి (Pattabhi) ఎద్దేవాచేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సూట్‌ కేసు కంపెనీలతో సీఎం జగన్‌ (CM Jagan), ఎంపీ విజయసాయిరెడ్డి బ్యాంకులను కొల్లగొడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీఎస్ డీసీ పేరుతో బ్యాంకుల నుంచి రూ.25 వేల కోట్ల రుణాలు తీసుకున్నారని తెలిపారు. కార్పొరేషన్ల పేరుతో డబ్బులు తీసుకువచ్చి దారి మళ్లించారని ఆరోపించారు. ఆర్‌బీఐ (RBI) కూడా కార్పొరేషన్ల అప్పుపై ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు. ఏపీలో ఆర్థిక ఉగ్రవాదాన్ని చూసి ఆర్బీఐ నిబంధనలు కఠినతరం చేసిందని తెలిపారు. కార్పొరేషన్లకు అప్పులపై రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన గ్యారింటీని, క్రైటీరియాగా తీసుకుని అప్పులు ఇవ్వడానికి వీల్లేదని ఆర్బీఐ చెప్పిందని గుర్తుచేశారు. రాష్ట్ర బడ్జెట్ అవసరాల కోసమే ఏపీఎస్ డీసీ అంటూ జీవో 80 విడుదల చేశారని, జీవో 80 జారీ ఆర్బీఐ మార్గదర్శకాల ఉల్లంఘనేనని పట్టాభి పేర్కొన్నారు.

Updated Date - 2022-07-23T20:23:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising