ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శనివారమూ పాస్‌పోర్టు సేవలు

ABN, First Publish Date - 2022-12-15T03:06:19+05:30

పాస్‌పోర్టుల కోసం రద్దీ పెరగడంతో తత్కాల్‌, జనరల్‌ పద్ధతిలో పాస్‌పోర్టుల జారీలో జాప్యాన్ని నివారించడానికి ఇక నుంచి శనివారం కూడా పాస్‌పోర్టు కార్యాలయాలు పనిచేస్తాయని రీజనల్‌ పాస్‌పోర్టు ఆఫీసర్‌ శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి శ్రీనివాసరావు

విజయవాడ (కృష్ణలంక), డిసెంబరు 14: పాస్‌పోర్టుల కోసం రద్దీ పెరగడంతో తత్కాల్‌, జనరల్‌ పద్ధతిలో పాస్‌పోర్టుల జారీలో జాప్యాన్ని నివారించడానికి ఇక నుంచి శనివారం కూడా పాస్‌పోర్టు కార్యాలయాలు పనిచేస్తాయని రీజనల్‌ పాస్‌పోర్టు ఆఫీసర్‌ శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే గత రెండు శనివారాలు పాస్‌పోర్టుల దరఖాస్తులు పరిశీలించగా ఈ నెల 17, 24 తేదీల్లోనూ పాస్‌పోర్టు కార్యాలయాలు పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. తత్కాల్‌, జనరల్‌ పద్ధతిలో పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ ఉంటుందని, అవసరమైన అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చని, సరైన పత్రాలు లేకుండా ఎవరూ రావద్దని ఆయన సూచించారు. విద్య, ఉద్యోగాలకు సంబంధించి అనేక మంది విదేశాలకు వెళుతున్నారని, విజయవాడ పాస్‌పోర్టు కార్యాలయంలోనే రోజుకు 600 దరఖాస్తులు ఇస్తున్నట్టు ఆయన వివరించారు. దళారులను నమ్మి ఎవరూ మోసపోవద్దని, పాస్‌పోర్టు కార్యాలయాల్లోనే అన్ని రకాల పౌరసేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Updated Date - 2022-12-15T03:06:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising