ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల తీరుపై పరిటాల సునీత, శ్రీరామ్‌ ఆగ్రహం

ABN, First Publish Date - 2022-06-14T00:27:14+05:30

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? నియంత పాలనసాగుతోందా అని మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామగిరి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? నియంత పాలనసాగుతోందా అని మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతు సమస్యలపై శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్‌ ముందు ధర్నా చేయడానికి పుట్టపర్తికి వెళ్తున్న సునీత, శ్రీరామ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టరేట్‌ వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డగించడంతో పోలీసులతో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌ తీవ్ర వాగ్వాదానికి దిగారు. రైతు సమస్యలపై పోరాడే హక్కు కూడా తమకు లేదా అని ప్రశ్నించారు. తాము నిరసన కార్యక్రమానికి వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు. పోలీసులు వైసీపీ ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ, టీడీపీ నాయకులు, కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఏదైనా అడ్డుకోవచ్చని, ఏమీ జరగకనే తమను అడ్డుకోవడం, వాహనాలకు అనుమతి లేదనం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తాము తక్కువ మందితో వెళ్లితే, అక్కడ పోలీసులు, వైసీపీ వారు దౌర్జన్యం చేస్తే దానికి ఎవరు బాధ్యులని పోలీసులను సునీత, శ్రీరామ్‌ ప్రశ్నించారు.

Updated Date - 2022-06-14T00:27:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising