ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: పయ్యావుల

ABN, First Publish Date - 2022-04-13T19:23:58+05:30

తిరుమలలో భక్తుల ఇబ్బందులు ఇప్పటికీ పరిష్కారం కాలేదని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తిరుమలలో భక్తుల ఇబ్బందులు ఇప్పటికీ పరిష్కారం కాలేదని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... లక్ష మందికి ఏర్పాట్లు చేయగలిగే టీటీడీ.... ఇప్పుడు భక్తులకు చలువ పందిళ్ళు కూడా ఎందుకు వెయ్యలేదని ప్రశ్నించారు. కొండమీద 1500 గదులు కేటాయించక పోవడానికి కారణం ఏంటని నిలదీశారు. సీఎం వస్తారని టీటీడీ జేఈవో ఎప్పుడో పోయి ఒంటిమిట్టలో కూర్చున్నారని మండిపడ్డారు. అసంబద్ధ నిర్ణయాల వల్లనే ఈ ఇబ్బందులు అని అన్నారు. రాజకీయాలకు అతీతంగా తిరుమల కోసం అంతా పోరాడాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. కొండ మీద పరిస్థితి చుసి ఇతర ప్రాంతాలలోని భక్తులు దర్శనానికి వెళ్ళాలి అంటే భయపడే పరిస్థితి తీసుకువచ్చారని వ్యాఖ్యానించారు. టీటీడీ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని... భక్తులు సంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి తీసుకురావాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-13T19:23:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising