ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్ కొనుగోళ్లపై నిలదీసిన పయ్యావుల .. మళ్లీ వస్తామన్న అధికారులు

ABN, First Publish Date - 2022-01-10T21:50:44+05:30

అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్యుత్ కొనుగోళ్లు, ప్రభుత్వ సబ్సిడీలపై వాడివేడి చర్చ జరిగింది. సోలార్ విద్యుత్ కొనుగోళ్లలో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీఏసీ సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో విద్యుత్ కొనుగోళ్లు, ప్రభుత్వ సబ్సిడీలపై వాడివేడి చర్చ జరిగింది. సోలార్ విద్యుత్ కొనుగోళ్లలో లోపాలను పయ్యావుల ప్రస్తావించారు. సెకీ టెండర్లను రూ. 2.49కే ఖరారు చేశారా? అని ప్రశ్నించారు. అంతకు మించి ఎక్కువ ఖర్చవుతుందా? అని అధికారులను పయ్యావుల నిలదీశారు. దీంతో సరైన సమాచారంతో మళ్లీ వస్తామని అధికారులు తెలిపారు. సంతకాలు, ఒప్పందాలు చేసుకుని గోప్యత పాటిస్తారా..? అని పయ్యావుల వ్యాఖ్యానించారు. ప్రజలకే కాదు.. అసెంబ్లీ కమిటీలకూ సమాచారం ఇవ్వరా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 2.49 కంటే అదనంగా ఖర్చు అవుతుందంటూ అంశాల వారీగా పయ్యావుల లెక్కలు వివరించారు. రూ.1కు పైగానే అదనపు ఖర్చు అవుతుందని అధికారులు అంగీకరించారు. అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో తెలంగాణ, కర్ణాటక నుంచి సమాచారం తెచ్చుకోవాల్సి వస్తోందని పయ్యావుల అవేదన వ్యక్తం చేశారు. తర్వాత సమావేశానికి పక్కా సమాచారంతో రావాలని అధికారులకు  పీఏసీ స్పష్టం చేసింది. 



Updated Date - 2022-01-10T21:50:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising