ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధాశ్రమాల ఏర్పాటుకు ఆదేశించండి

ABN, First Publish Date - 2022-09-11T09:55:44+05:30

తల్లిదండ్రులు మరియు సీనియర్‌ సిటిజన్ల నిర్వహణ చట్టం మేరకు రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైకోర్టులో పిల్‌... విచారణ వాయిదా

అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులు మరియు సీనియర్‌ సిటిజన్ల నిర్వహణ చట్టం మేరకు రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. తల్లిదండ్రులు మరియు సీనియర్‌ సిటిజన్ల నిర్వహణ చట్టం 2007 మేరకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రాపోలు భాస్కర్‌ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వి.రఘు వాదనలు వినిపిస్తూ... చట్టంలోని సెక్షన్‌ 19 ప్రకారం ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటి ఏర్పాటు కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. 

Updated Date - 2022-09-11T09:55:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising