ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Online Loan Appలపై ఎట్టకేలకు స్పందించిన 'మహిళా కమిషన్'

ABN, First Publish Date - 2022-07-12T20:47:01+05:30

Online రుణ యాప్‌లపై ఎట్టకేలకు ఏపీ (AP) మహిళా కమిషన్ స్పందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): Online రుణ యాప్‌లపై ఎట్టకేలకు ఏపీ (AP) మహిళా కమిషన్ స్పందించింది. యాప్‌లను బ్లాక్ (Block) చేసేందుకు చర్యలు చేపట్టాలని మహిళా కమిషన్ (Mahila commission) చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) డీజీపీ (DGP)ని కోరారు. ఆన్‌లైన్‌ రుణ యాప్‌‌ల వలలో చిక్కి బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తేలికగా రుణాలు అంటగట్టి వడ్డీల మీద వడ్డీలు వేస్తూ రుణ యాప్‌లు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి.


మంగళగిరి (Mangalagiri)లోని నవులూరుకు చెందిన జాస్తి చౌదరి (Jasti Choudhary) ఆన్‌లైన్ మోసానికి గురై చెరువులో దూకి చనిపోయింది.. తాజాగా మంగళగిరిలోనే మరో బాధితురాలు ప్రత్యూష (Prathyusha) ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి భర్త రాజశేఖర్‌తో వాసిరెడ్డి పద్మ ఫోన్‌లో మాట్లాడారు. భవిష్యత్తులో ఇలాంటి రుణ యాప్‌ల వేధింపులకు మరొకరు బలిగాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. రుణ యాప్‌లను బ్లాక్ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరుతూ వాసిరెడ్డి పద్మ లేఖ రాశారు. రుణ యాప్‌లను తొలగించేందుకు వెంటనే ప్లేస్టోర్‌లను సంప్రదించాలని, రుణ యాప్‌ల నిర్వాహకులను కట్టడి చేసేలా సమగ్ర నివేదిక సమర్పించాలని వాసిరెడ్డి పద్మ ఆ లేఖలో కోరారు.  

Updated Date - 2022-07-12T20:47:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising