ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

6 దాటినా నిరీక్షణే!

ABN, First Publish Date - 2022-12-07T03:28:37+05:30

ఈ నెల 6వ తేదీ దాటిపోయినా రాష్ట్రంలో సర్కారీ ఉద్యోగులు జీతాల కోసం, పింఛన్‌ దారులు తమ పెన్షన్‌ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ 40ు మంది ఉద్యోగులకువేతనాలు చెల్లించలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

40ు మంది ఉద్యోగులకు, 80ు మంది పెన్షనర్లకు అందని వేతనం

అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఈ నెల 6వ తేదీ దాటిపోయినా రాష్ట్రంలో సర్కారీ ఉద్యోగులు జీతాల కోసం, పింఛన్‌ దారులు తమ పెన్షన్‌ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ 40ు మంది ఉద్యోగులకువేతనాలు చెల్లించలేదు. 80 శాతం మంది పింఛనుదారులకు పెన్షన్‌ కూడా ఇవ్వలేదు. దీంతో వారంతా సర్కారు కరుణకోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చిందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఎస్‌ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అమరావతి సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. 1936 ఇండియన్‌ వేజెస్‌ యాక్టు ప్రకారం 7వతేదీలోగా జీతాలివ్వకపోతే యాజమాన్యంపై చర్య తీసుకోవచ్చని చట్టంలో పేర్కొన్నట్టు తెలిపారు. అదేసమయంలో, ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలివ్వాలని నిబంధన ఉన్నా, చెల్లించకపోతే ఏం చేయాలో స్పష్టత లేదన్నారు. ఇప్పుడు చట్టం చేసేలా డిమాండ్‌ లేవనెత్తే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సకాలంలో వేతనాలు ఇవ్వాలని టీఎన్‌యూఎస్‌ అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ప్రతినెలా జీతాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.

Updated Date - 2022-12-07T03:28:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising