ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ రైతులకు అందని పీఎం కిసాన్

ABN, First Publish Date - 2022-03-09T16:52:48+05:30

కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పెట్టుబడి, సాయం రాష్ట్రంలోని రైతులకు సక్రమంగా చేరడంలేదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పెట్టుబడి, సాయం రాష్ట్రంలోని రైతులకు సక్రమంగా చేరడంలేదు. సీఎం కిసాన్ పథకం కింద సాగుభూమి ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ. 6వేలు మూడు విడతలుగా ఇస్తోంది. ఈ సహాయం రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ అందడంలేదు. పీఎం కిసాన్‌ పోర్టర్‌లో నమోదైన రైతుల్లోనే 25 శాతం మందికి నగదు జమ కావడంలేదు. 


2018-19లో పథకం ప్రారంభించినప్పుడు 44వేల మందికి సొమ్ము అందలేదు. ఇప్పటికీ సుమారు 15లక్షల మంది రైతులకు కేంద్రసాయం రావట్లేదు. తెలంగాణలో 90శాతం పైగా రైతులకు సొమ్ము జమ అవుతోంది. ఈ నెల ఒకటో తేదీన 95శాతం రైతుల ఖాతాలకు పీఎం కిసాన్‌ సొమ్ము జమ అయ్యింది. గత విడతలో నూరు శాతం సొమ్ము జమ అయ్యింది. కానీ రాష్ట్రంలో పరిస్థితి విరుద్ధంగా ఉంది. రాష్ట్రంలోని రైతులకు పీఎం కిసాన్‌ నిధులు పది విడతలుగా జమైనా.. ఒక్కసారి కూడా నూరు శాతానికి చేరుకోలేదు. బ్యాంకు ఖాతాలు సక్రమంగా లేకపోవడం, రైతుల ఆధార్‌, ఈకేవైసీ వంటి సమస్యల కారణంగా పీఎం కిసాన్‌ సొమ్ము రైతుల ఖాతాలకు జమ కావట్లేదని తెలుస్తోంది. 

Updated Date - 2022-03-09T16:52:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising