ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏ నోటీసూ అందలేదు

ABN, First Publish Date - 2022-10-07T08:09:26+05:30

ఏ నోటీసూ అందలేదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎఫ్‌ఐఆర్‌ కాపీ కూడా ఇవ్వలేదు

మా ఇంటికొచ్చి నానా రచ్చ చేశారు

సీఐడీ అదనపు డీజీకి చింతకాయల విజయ్‌ లేఖ


గుంటూరు, అక్టోబరు 6: టీడీపీ నేత చింతకాయల విజయ్‌ రాసిన లేఖను సీఐడీ అధికారులకు అందించేందుకు డీజీపీ కార్యాలయానికి వెళ్లిన ఆయన తరఫు న్యాయవాదులు రోజంతా నిరీక్షించినా లాభం లేకపోయింది. సీఐడీ అధికారుల నుంచి స్పందనే లేదు. సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌కు సంబంధించి నమోదైన కేసులో ఐటీడీపీ ఇన్‌చార్జి చింతకాయల విజయ్‌ నిందితుడంటూ ఇటీవల సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు వార్తలొచ్చిన విషయం విదితమే. అయితే తనకు నోటీసే అందలేదని.. తనపై కేసేమిటో.. నమోదైన అభియోగాలేమిటో తెలియదని విజయ్‌ గురువారం సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌, కేసు విచారణాధికారి చంద్రశేఖర్‌కు లేఖ రాశారు. కనీసం ఎఫ్‌ఐఆర్‌ కాపీ కూడా అందజేయలేదన్నారు. తాను ఇంట్లో లేని సమయం లో సీఐడీ సీఐతోపాటు పది మంది అక్రమంగా ప్రవేశించి తన కూతురిని భయభ్రాంతురాలిని చేసి.. పనివారి పట్ల అమానుషంగా ప్రవర్తించారని.. అంత చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కేసు వివరాలిస్తే.. న్యాయ సలహా అనంతరం సమాధానమిస్తానని తెలిపారు. ఈ లేఖను సీఐడీ ఉన్నతాధికారులకు ఇచ్చేందుకు టీడీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాదులు దొద్దాల కోటేశ్వరరావు, మాగులూరి హరిబాబు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. విచారణాధికారికి ఫోన్‌చేసి.. తాము కలవడానికి వచ్చామని తెలియజేయగా.. పై అంతస్థులో ఏడీజీ కార్యాలయంలో ఉన్నానని చెప్పారు. ఉదయం 10నుంచి 11గంటల వరకు ఫోన్లో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. 11 గంటల తర్వాత ఆయన నుంచి స్పందన లేదు. వాట్సాప్‌ సందేశాలకూ స్పందించలేదు. సాయంత్రం 5గంటల వరకు అక్కడే నిరీక్షించి.. చివరకు డీజీపీ, సీఐడీ ఏడీజీ కార్యాలయాల తప్పాల్‌ సెక్షన్‌లో లేఖను అందజేసి వెనుతిరిగారు. 


Updated Date - 2022-10-07T08:09:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising