ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raghurama: లోక్‌సభలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు: రఘురామ

ABN, First Publish Date - 2022-12-16T01:29:15+05:30

న్యాయస్థానాలు, లోక్‌సభ తనకు అండగా లేకపోయినా... ప్రజలు అండగా ఉన్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): న్యాయస్థానాలు, లోక్‌సభ తనకు అండగా లేకపోయినా... ప్రజలు అండగా ఉన్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. తనకు జరిగిన అన్యాయానికి లోక్‌సభ ద్వారా పూర్తి న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదన్నారు. ప్రజా న్యాయస్థానంలో మాత్రం న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పక్కవారిని హింసిస్తుంటే, ఫోనులో చూసి ఆనందించే వికృత మనస్తత్వం కలిగిన వారికి ఓటు అనే ఆయుధం ద్వారానే బుద్థి చెప్పాలని కోరారు. పోలీస్‌ కస్టడీలో తాను ఎదుర్కొన్న చిత్రహింసలను వివరిస్తూ ప్రధానమంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు. దేశంలోని ఎంపీలందరికీ మళ్లీ లేఖలు రాస్తానన్నారు. పోలీస్‌ కస్టడీలో తనని చిత్రహింసలకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, తన కుమారుడు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారన్నారు. ఈ 19 మాసాల వ్యవధిలో 30 సార్లు మెన్షన్‌ చేసినప్పటికీ, కేసు విచారణ జరగలేదని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రమేయం వల్లనే ఇలా జరిగి ఉండవచ్చునన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. తాజాగా పిటిషన్‌ ఉపసంహరించుకుని హైకోర్టుకు వెళ్తారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని, తాను సమ్మతించినట్లు చెప్పారు. ఐపీసీ 66ఏ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేయడాన్ని సుప్రీంకోర్టు నిషేధించిందని, అయినా ఇంకా 66ఏ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్రాన్ని ప్రశ్నించిందన్నారు. కాగా, రాష్ట్రంలో అవినీతి కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోందని రఘురామరాజు ఎద్దేవా చేశారు. ల్యాండ్‌, శాండ్‌, మైన్‌, వైన్‌లతోపాటు.. గృహ నిర్మాణ పథకంలో లెక్కకు మించి అవినీతి జరిగిందని చెప్పారు.

Updated Date - 2022-12-16T01:29:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising