ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాపాకకు నో ఎంట్రీ ఫ్లెక్సీ

ABN, First Publish Date - 2022-03-15T02:39:14+05:30

గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి గెలుపొంది, ఫిరాయించిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై ఓ ఆసక్తికరమైన ఫ్లెక్సీని జనసైనికులు ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లి: గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి గెలుపొంది, ఫిరాయించిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై ఓ ఆసక్తికరమైన ఫ్లెక్సీని జనసైనికులు ఏర్పాటు చేశారు. ఆవిర్భావ సభకు వెళ్లే మార్గంలో రాపాక ఫోటోతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేసి అందులో నో ఎంట్రీ అని వ్రాశారు. పలువురు ఈ ఫ్లెక్సీని విస్మయంతో తిలకించడం కనిపించింది. జనసేన కార్యకర్తలు, అభిమానులతో ఆవిర్భావ సభ ప్రాంగణం హోరెత్తింది. తాడేపల్లి మండలం, ఇప్పటం గ్రామ పరిధిలో జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ సోమవారం జరిగింది. కొలనుకొండ జాతీయ రహదారి నుండి సభా ప్రాంగణానికి వెళ్లే సుమారు 3 కిలోమీటర్ల రహదారి కిక్కిరిపోయింది. గోదావరి జిల్లాల నుండి వచ్చిన బస్‌లకు, సభవద్దకు వెళ్లే దారి లేకపోవడంతో జాతీయ రహదారిపైనే పార్కింగ్‌ చేశారు. సభా ప్రాంగణానికి వెళ్లే దారి తిరనాళ్ళ వాతావరణాన్ని తలపింపజేసింది. అడుగడుగునా మజ్జిగ ప్యాకెట్లు, మంచినీటి ప్యాకెట్లును పంపిణీ చేశారు. పవన్‌ కళ్యాణ్‌ టీ-షర్ట్‌లు, ఫేస్‌ మాస్క్‌లు కొనుగోలుపై అభిమానులు, కార్యకర్తలు ఆసక్తి చూపించారు. జనసేన అధినేతను చూసేందుకు వేదిక దగ్గరగా ఉన్న నాయకుల ఫెక్సీలు, బారికేడ్లుపై ఎక్కి అభిమానులు విన్యాసాలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 6.15 గంటలకు పవన్‌ కళ్యాణ్‌ వేదిక మీదకు వచ్చేదాకా, పలు సాంస్కృతిక కార్యక్రమాలు, పవన్‌ ఆడియోలను ప్రదర్శించారు. 


Updated Date - 2022-03-15T02:39:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising