ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలపై చర్చ లేదు పురోభివృద్ధిపై ధ్యాసా లేదు

ABN, First Publish Date - 2022-12-16T01:36:02+05:30

బస్సులన్నీ పాడైపోయాయి. ఎక్కడి కక్కడ ఆగిపోతున్నాయి. వర్షం వస్తే కురుస్తున్నాయి. గతుకుల రోడ్లపై చక్రాలు ఊడిపోతున్నాయి. ఇలాంటి బస్సుల్లో ప్రయాణమంటేనే ప్రయాణికులు హడలి పోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్టీసీ బోర్డు మీటింగ్‌ తీరుపై కార్మికుల్లో అసంతృప్తి

అధికారుల నిర్ణయాలకు తలూపేందుకేనా బోర్డు

కార్మికులు, ప్రయాణికుల బాధలు పట్టవా? అని విమర్శలు

అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): బస్సులన్నీ పాడైపోయాయి. ఎక్కడి కక్కడ ఆగిపోతున్నాయి. వర్షం వస్తే కురుస్తున్నాయి. గతుకుల రోడ్లపై చక్రాలు ఊడిపోతున్నాయి. ఇలాంటి బస్సుల్లో ప్రయాణమంటేనే ప్రయాణికులు హడలి పోతున్నారు. డ్రైవర్లు వాటిని నడపలేక స్టీరింగ్‌పైనే వాలిపోతున్నారు.. ఈ సమస్యల్ని అధిగమించేది ఎలా.? సంస్థ పురోభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల గరించి చేయాల్సిందేంటి? అనే విషయాలపై చర్చించాల్సిన ఏపీఎ్‌సఆర్టీసీ పాలకమండలి అవేమీ పట్టించుకోవడం లేదు. కేబినెట్‌ హోదా పదవులు అనుభవిస్తూ అటు ప్రయాణికుల సౌకర్యాలు గాని, ఇటు సిబ్బంది సమస్యలు గానీ ప్రస్తావించడం లేదు. విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో చైర్మన్‌ మల్లికార్జున రెడ్డి అధ్యక్షతన గురువారం నాడు బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్‌ చైర్మన్‌ విజయానంద రెడ్డి, ఎండీ ద్వారకా తిరుమల రావు, రవాణా శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, నలుగురు మహిళా రీజినల్‌ చైర్మన్లు పాల్గొన్నారు. ఆర్టీసీ స్థలాలు ఎన్ని లీజుకు ఇచ్చారనేది మొదలు గత సమావేశం నుంచి ఇప్పటి దాకా అధికారులు తీసుకున్న నిర్ణయాలకు బోర్డు ఆమోదం తెలిపింది. అంతేతప్ప ప్రయాణికుల సౌకర్యాలు కానీ, కార్మికుల సమస్యలు గానీ చర్చించలేదని నిరసన వ్యక్తమవుతోంది. సాధారణంగా ఆర్టీసీ బోర్డు మీటింగ్‌ అంటే తొలుత ప్రయాణికుల సౌకర్యాలపై చర్చ జరుగుతుంది. ఆతర్వాత సంస్థ పురోభివృద్ధి.. సిబ్బంది సమస్యలపై ఆయా ప్రాంతాల వారీగా రీజినల్‌ ఛైర్మన్లు ప్రస్తావిస్తారు. సముచిత నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం బోర్డులోని అధికారుల బాధ్యత. అయితే రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీకి కొత్త బస్సులు కొనుగోలు చేయలేదు.

ఉన్న బస్సులు దాదాపు గుజిరీ దశకు చేరుకున్నాయి. అయినా రంగులేసి నడుపుతున్నారు. వాటి స్థానంలో అద్దె బస్సులు తీసుకోవడానికి యాజమాన్యం ప్రయత్నించినా ఆశించిన స్థాయిలో స్పందన లేదు. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ 1,020 కొత్త బస్సులు కొనుగోలు చేసి తిరుపతి, విజయవాడకు తిప్పుతోంది. పండగల సందర్భంగా ప్రయాణ రాయితీ కూడా ఇస్తోంది. ఇటువంటి కీలక అంశాలపై బోర్డు సమావేశంలో చర్చ జరుగుతుందని, రాష్ట్ర ప్రజలకు, ఏపీఎ్‌సఆర్టీసీకి మేలు జరిగే నిర్ణయాలు బోర్డు తీసుకుంటుందని అంతా ఆశించారు. కానీ అవేమీ సమావేశంలో చర్చకు రాలేదు. ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వంలో విలీనం అయ్యాక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వైద్య సేవలు మొదలుకొని ఎస్‌ఆర్‌బీసీ, ఎస్బీటీ, కారుణ్య నియామకాలు, అనారోగ్యం పాలైన కుటుంబ సభ్యుల పిల్లలకు ఉద్యోగాలు ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిపై బోర్డులో చర్చ జరిగిందా అంటే సమాధానం లేదు. ఆర్టీసీకి ఆదాయం తెచ్చిపెడుతున్న కార్గో సేవలపై ఎక్కడి కక్కడ ఫిర్యాదులు వస్తున్నాయి. అయినా వాటిని సరిచేసే విషయమై కనీస చర్చ జరగలేదు. విద్యుత్‌ బస్సులు ప్రవేశ పెట్టాలని ఇటీవల ముఖ్యమంత్రి ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆదేశించారు. సాధ్యాసాధ్యాలపై బోర్డులో చర్చించి ఇబ్బందులు ఉంటే వాటిని అధిగమించే ప్రణాళికతో ప్రభుత్వానికి నివేదిక పంపాల్సిన పాలకమండలి ఈ విషయమై ఏమి చర్చిందని అడిగితే ‘మాకు తెలియదు’ అనే సమాధానమే అధికారుల నుంచి వస్తోంది.

Updated Date - 2022-12-16T01:36:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising