ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజామాబాద్ ఫ్యామిలీ సూసైడ్ కేసు విచారణ వేగవంతం

ABN, First Publish Date - 2022-01-10T21:10:14+05:30

ఉభయ తెలుగా రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన నిజామాబాద్ ఫ్యామిలీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఉభయ తెలుగా రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన నిజామాబాద్ ఫ్యామిలీ పప్పుల సురేశ్‌ కుటుంబం సూసైడ్ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. వేధింపులకు పాల్పడిన వడ్డీ వ్యాపారులు నలుగురిపై 306 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గణేష్, వినీత, చంద్రశేఖర్, జ్ఞానేశ్వర్ పై 306 సెక్షన్ కింద ఎఫ్‌ఐఆర్ దాఖలయింది. ఈ నలుగురు పప్పుల సురేష్ కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని సెల్ఫీ వీడియోలు, సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేశారు. నిందితుల కోసం నిజామాబాద్‌కి బెజవాడ పోలీసు బృందం వెళ్లింది. నిజామాబాద్, నిర్మల్ నుంచి ఇప్పటికే నిందితులు పరారైనట్టు సమాచారం. స్థానిక పోలీసులతో కలిసి నిందితుల కోసం బెజవాడ పోలీసులు గాలిస్తున్నారు.  


 శనివారం సురేశ్‌ భార్య శ్రీలత, చిన్నకుమారుడు ఆశిష్‌ సత్రంలో అధిక మోతాదులో ఇన్సూలిన్‌ తీసుకుని, సురేశ్‌ అతని పెద్ద కుమారుడు అఖిల్‌ కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్య చేసకున్న విషయం తెలిసిందే. సురేశ్‌ రాసిన సూసైడ్‌ నోట్‌, బావమరిదికి పంపిన సెల్ఫీ వీడియో, మిత్రులకు పంపిన వాయిస్‌ మెసేజ్‌ల ఆధారంగా.. ఫైనాన్సర్ల వేధింపులు భరించలేకే ఆ కుటుంబం ఆత్మహత్యకు ప్రధాన కారణాలని ప్రాథమికంగా నిర్ధారించారు.

Updated Date - 2022-01-10T21:10:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising