ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేత.. కానీ..

ABN, First Publish Date - 2022-02-15T00:09:48+05:30

ఏపీలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కరోనా నిబంధనలను ప్రతిఒక్కరు పాటించాలని సూచించారు. మాస్కులు తప్పనిసరిగా వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఫీవర్ సర్వేను కొనసాగించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏజన్సీ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని జగన్ ఆదేశించారు. వైద్యారోగ్యశాఖలో ఖాళీల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నలిచ్చింది. 


కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఈ ఏడాది జనవరి 18వ  తేదీ నుండి ఏపీలో నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 434 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో మొత్తం 23,13,212కు పాజిటివ్‌ కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 14,698 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 14,726 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 22,83,788 మంది రికవరీ అయ్యారు. 

Updated Date - 2022-02-15T00:09:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising