ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూరియా బస్తాలో కాదు.. ఇప్పుడు బాటిళ్లలో!

ABN, First Publish Date - 2022-01-15T04:27:33+05:30

ఇఫ్‌కో ద్వారా యూరియా బస్తాల రూపంలో కాకుండా ద్రావణంగా బాటిళ్లలో లభిస్తుందని రాష్ట్ర ఇఫ్‌కో మార్కెటింగ్‌ మేనేజర్‌ రఽశీధర్‌రెడ్డి అన్నారు.

మనుబోలులో రైతులతో కలిసి యూరియా బాటిల్స్‌ను చూపుతున్న ఇఫ్‌కో కంపెనీ ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇఫ్‌కో మార్కెటింగ్‌ మేనేజర్‌ శ్రీధర్‌రెడ్డి


మనుబోలు, జనవరి 14: ఇఫ్‌కో ద్వారా యూరియా బస్తాల రూపంలో కాకుండా ద్రావణంగా బాటిళ్లలో లభిస్తుందని రాష్ట్ర ఇఫ్‌కో మార్కెటింగ్‌ మేనేజర్‌ రఽశీధర్‌రెడ్డి అన్నారు. స్థానిక మ్యాక్స్‌ సొసైటీలో శుక్రవారం ఇఫ్‌కో కంపెనీ ఆధ్వర్యంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడేళ్ల పాటు ప్రయోగాల అనంతరం యూరియాను బాటిళ్లలో నానో యూరియా లిక్విడ్‌గా  అందిస్తున్నామన్నారు. అరలీటరు ద్రావణం ఎకరాకు పిచికారీ చేస్తే 45 కిలోల బస్తా యూరియా కంటే మెరుగ్గా పనిచేస్తుందన్నారు. బస్తా యూరియా ధర కంటే నానోయూరియా లిక్విడ్‌ తక్కువ ధరకే లభిస్తుందన్నారు. ఇది మొక్కకు నూరుశాతం ఉపయోగపడుతుందని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇఫ్‌కో ఆర్‌జీబీ సభ్యుడు తలమంచి సురేష్‌కుమార్‌రెడ్డి, మార్కెటింగ్‌ అధికారి అతావుల్లా, ఇఫ్‌కో సెజ్‌ ప్రతినిధులు బొమ్మిరెడ్డి చైతన్య, సోమేశ్వరరావు, మ్యాక్స్‌ సొసైటీ డైరెక్టర్‌ తుమాటి శ్రీనివాసులురెడ్డి, మనుబోలు పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి బొమ్మిరెడ్డి  మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2022-01-15T04:27:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising